బంగ్లాదేశ్‌ తో నేడే ఫస్ట్‌ టీ 20

గ్వాలియర్‌ వేదికగా మ్యాచ్‌.. బంద్‌ కు పిలుపునిచ్చిన హిందూ మహాసభ

Advertisement
Update:2024-10-06 10:04 IST

భారత క్రికెట్‌ అభిమానులకు ఆదివారం పొట్టి క్రికెట్‌ మస్త్‌ మజా ఇవ్వనుంది. అదే సమయంలో మ్యాచ్‌ ను అడ్డుకుంటామన్న హిందు మహాసభ హెచ్చరికలు హైటెన్షన్‌ పుట్టిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ తో ఫస్ట్‌ టీ 20లో టీమిండియా తలపడనుంది. రాత్రి 7 గంటలకు గ్వాలియర్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ కోసం సూర్యకుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని భారత జట్టు సమయాత్తమయ్యింది. గ్వాలియర్‌ లోని న్యూ మాధవరావు సింధియా క్రికెట్‌ స్టేడియంలో 14 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతుండటంతో అక్కడి క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠగా మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. బంగ్లాదేశ్‌ లో హిందువులపై జరుగుతోన్న దాడులను నిరసిస్తూ హిందూ మహాసభ ఆదివారం గ్వాలియర్‌ బంద్‌ కు పిలుపునిచ్చింది. మ్యాచ్‌ ను అడ్డుకొని తీరుతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం 1,600 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇండియన్‌ సివిల్ సెక్యూరిటీ కోడ్‌ సెక్షన్‌ 163 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా మ్యాచ్‌ కు అంతరాయం కలిగించినా, ఇతరులను రెచ్చగొట్టినా కఠిన చర్యలు తీసుకోనున్నారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇదే స్టేడియంలో వన్‌ డేల్లో ఫస్ట్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. పిచ్‌ బ్యాటింగ్‌ కు అనుకూలంగా ఉండటంతో పరుగుల వరద పారడం ఖాయమని చెప్తున్నారు. 2010లో ఈ స్టేడియంలో ఇండియా - సౌత్‌ ఆఫ్రికా మధ్య చివరి మ్యాచ్‌ జరిగింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ లు నిర్వహిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News