ఇంగ్లండ్ తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత జట్టు పరాజయం పాలైంది. మొదటి రెండు మ్యాచుల్లో గెలిచి సిరీస్ మీద కన్నేసిన ఇండియా ఈ మ్యాచ్‌లో ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 తేడాతో ముందుంజలో ఉంది. మూడో టీ20లో ఇండియాపై ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. 172 పరుగుల టార్గెట్‌తో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది. భారత బ్యాటర్లలో హార్థిక్ పాండ్యా 40, అభిషేక్ శర్మ 24, తిలక్ వర్మ 18, సూర్యకుమార్ యాదవ్ 14, అక్షర్ పటేల్ 15 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మన్లు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓవర్టన్ 3, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్సే తలా రెండు వికెట్లు పడగొట్టారు. రషీద్, మార్క్‌వుడ్ కు తలా ఒక వికెట్ దక్కింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్లలో బెన్ డకెట్ 51, లివింగస్టన్ 43, జోస్ బట్లర్ 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టాడు. హార్థిక్ పాండ్యాకు రెండు, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ కు తలా ఒక వికెట్ దక్కింది. ఈ సిరీస్ లోమ మిగతా రెండు మ్యాచ్‌లు ఈనెల 31న పూణేలో, ఫిబ్రవరి 2న ముంబయిలో జరుగనున్నాయి.