38వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాని మోదీ

డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలను ప్రధాని మోదీ ప్రారంభించారు.

Advertisement
Update:2025-01-28 21:30 IST

 ఉత్తరాఖండ్‌ డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఫిబ్రవరి 14 వరకు ఈ క్రీడలు కొనసాగుతాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి దాదాపు 10 వేల మంది క్రీడాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రీన్ గేమ్స్ థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, గేమ్స్ విలేజ్ బయట 10 వేల మొక్కలను క్రీడాకారులు నాటారు. మొత్తం 35 విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ వైభవోత్సవానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు.

యోగా, మల్లఖంబ్‌లను మొదటిసారిగా ఈ జాతీయ క్రీడలలో చేర్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైగా అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశం నలుమూలల నుంచి వచ్చే 16,000 మందికి పైగా ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులతో కూడిన జట్లు ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నాయి. ఈ క్రమంలో అన్ని మైదానాలు.. అథ్లెటిక్స్, క్రికెట్ తదితర క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి

Tags:    
Advertisement

Similar News