రెండో టీ20లో ఇండియా టార్గెట్ 166
20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసిన ఇంగ్లండ్
రెండో టీ20లో ఇంగ్లండ్ జట్టు ఇండియాకు 166 పరుగుల టార్గెట్ ఇచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్లు 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేశారు. చెన్నై వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోగా.. కెప్టెన్ అంచనాకు తగ్గట్టుగానే బౌలర్లు రాణించారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోగా జోక్ బట్లర్ దాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 30 బంతుల్లో 45 పరుగులు చేసిన బట్లర్ అక్సర్ పటేల్ బౌలింగ్ లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్న బ్రాడెన్ కార్స్‌ను రవి బిష్ణోయ్, ధ్రువ్ జురేల్ కలసి 31 పరుగుల వద్ద రనౌట్ చేశారు. ఇంగ్లండ్ జట్టులో జేమి స్మిత్ 22, లివింగ్‌స్టోన్, హారి బ్రూక్ 13 పరుగులు చొప్పున, ఆదిల్ రషీద్ పది పరుగులు చేశారు. జోఫ్రా ఆర్చర్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో అక్సర్ పటేల్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు పడగొట్టారు. అర్షదీప్ సింగ్, హార్థిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.