ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బూమ్రా
వన్ డే ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంథన
Advertisement
ఇండియన్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బూమ్రా ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ -2024 అవార్డుకు ఎంపికయ్యారు. నిరుడు భారత్ తరపున 13 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బూమ్రా 71 వికెట్లు నేలకూల్చాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న బౌలర్‌గానూ బూమ్రా రికార్డు సృష్టించాడు. ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అర్షదీప్ సింగ్ ఎంపికయ్యాడు. ఐసీసీ ఉమెన్ వన్‌డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఇండియన్ స్టార్ క్రికెటర్ స్మృతి మంథన ఎంపికయ్యారు. 2024లో 13 వన్ డే మ్యాచ్‌లు ఆడిన మంథన 57.46 సగటుతో 747 పరుగులు చేశారు. ఇందులో నాలుగు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2018లోనూ స్మృతి మంథన ఉమెన్ వన్‌డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇప్పుడు రెండోసారి ఆ ఘనతను సొంతం చేసుకున్నారు.
Advertisement