2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తాం
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి భారత్ లేఖ
Advertisement
విశ్వ క్రీడల (ఒలింపిక్స్) కు ఆతిథ్యమిచ్చేందుకు అవకాశం ఇవ్వాలని భారత్ కోరుతోంది. 2036లో ఒలింపిక్స్ తో పాటు పారా ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇస్తామని.. తమకు ఆ అవకాశం ఇవ్వాలని కోరింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి భారత్ లేఖ రాసింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఈమేరకు ఐఓసీకి విజ్ఞప్తి చేసింది. విశ్వక్రీడల నిర్వహణకు భారత్ ఆసక్తి కనబరచడం ఇదే మొదటిసారి. ఒలింపిక్స్ నిర్వహణకు అవకాశమిస్తే డెడికేటెడ్ గా స్పోర్ట్స్ విలేజ్ నిర్మించడంతో పాటు ప్రపంచస్థాయి వసతులతో కూడిన స్టేడియంలు, ట్రాక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. భారత్ ఇప్పటి వరకు ఆసియా, అప్రో ఏసియన్ గేమ్స్ కు ఆతిథ్యం ఇచ్చింది.
Advertisement