సిక్స్రర్ల కింగ్ రోహి(ట్ )త్ శర్మ

భారత కెప్టెన్ రోహిత్ శర్మ అనగానే...అభిమానులకు గ్రౌండ్ నలుమూలలకూ అతను అలవోకగా బాదే సిక్సర్ షాట్లే గుర్తుకు వస్తాయి. నాగపూర్ లోని విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో రోహిత్ 4 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 43 పరుగుల నాటౌట్ స్కోరుతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం దక్కించుకొన్నాడు.

Advertisement
Update:2022-09-24 11:02 IST

టీ-20 అంతర్జాతీయ క్రికెట్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. నాగపూర్ లో ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ కివీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పేరుతో ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును తెరమరుగు చేశాడు...

భారత కెప్టెన్ రోహిత్ శర్మ అనగానే...అభిమానులకు గ్రౌండ్ నలుమూలలకూ అతను అలవోకగా బాదే సిక్సర్ షాట్లే గుర్తుకు వస్తాయి. నాగపూర్ లోని విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టీ-20 మ్యాచ్ లో రోహిత్ 4 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 43 పరుగుల నాటౌట్ స్కోరుతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సైతం దక్కించుకొన్నాడు.

సిక్సర్ హిట్టర్లలో టాప్ రోహిత్...

ఆస్ట్రేలియాతో ముగిసిన రెండో టీ-20లో రోహిత్ నాలుగు భారీసిక్సర్లు బాదడం ద్వారా...ఇప్పటి వరకూ అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో అత్యధిక సిక్సర్లు ( 172 ) బాదిన మొనగాడిగా ఉన్న కివీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ రికార్డును రోహిత్ అధిగమించడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ ల్లో అత్యధికంగా 176 సిక్సర్లు బాదిన తొలి ఓపెనర్ గా, కెప్టెన్ గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. 124 సిక్సర్లతో క్రిస్ గేల్ మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.


మూడుఫార్మాట్లలో 456 సిక్సర్లు..

అంతేకాదు..అంతర్జాతీయ క్రికెట్లో 400 సిక్సర్ల మైలురాయిని చేరిన భారత తొలి క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రమే. క్రికెట్ మూడుఫార్మాట్లలోనూ కలసి 456 సిక్సర్లు సాధించాడు.

టెస్టుల్లో 64, వన్డేల్లో 250, టీ-20ల్లో 176 సిక్సర్లు బాదడం ద్వారా రోహిత్ సిక్సర్లకింగ్ గా గుర్తింపు పొందాడు.

అగ్రస్థానంలో క్రిస్ గేల్..

క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 534 సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు విండీస్ సుడిగాలి ఓపెనర్ క్రిస్ గేల్ పేరుతో ఉంది. టెస్ట్, వన్డే, టీ-20 ఫార్మాట్లలో కలసి గేల్ 500కు

పైగా సిక్సర్లు బాదిన తొలి, ఒకే ఒక్క క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఆ తర్వాతి స్థానంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిదీ 476 సిక్సర్లతో రెండోస్థానంలో

కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 404 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఓ టెస్ట్ సిరీస్ లో అత్యధికంగా 19 సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు సైతం రోహిత్ పేరుతోనే ఉంది.

ఐపీఎల్ లో రోహిత్ బాదుడే బాదుడు...

ఐపీఎల్‌గత సీజన్లో .. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ 400వ సిక్స‌ర్ కొట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇండియా త‌ర‌ఫున రోహిత్ మాత్ర‌మే ఈ ఘ‌న‌త సాధించాడు. అత‌ని త‌ర్వాత ఏ బ్యాట‌ర్ కూడా 350 సిక్స‌ర్లు దాటలేదు. 325 సిక్స‌ర్ల‌తో సీఎస్కే బ్యాట‌ర్ సురేశ్ రైనా రెండోస్థానంలో ఉండ‌గా.. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి 320 సిక్స‌ర్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ 304 సిక్స్‌లు మాత్రమే సాధించగలిగాడు..

ఇక రోహిత్ సాధించిన మొత్తం 400 సిక్స‌ర్ల‌లో 133 భారత్ తరపున కాగా.. 227 సిక్సర్లు ఐపీఎల్‌లో సాధించినవే కావడం విశేషం. ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడుతూ 200 సిక్సర్లు సాధించిన మరో రికార్డును సైతం రోహిత్ గత సీజన్లోనే సాధించగలిగాడు.

చాంపియన్స్ లీగ్ టీ20లో 24 సిక్సర్లు బాదాడు. టీ-20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స్‌ల రికార్డు విండీస్ దిగ్గ‌జం క్రిస్ గేల్ పేరిట ఉంది. 1042 సిక్స‌ర్ల‌తో అత‌డు ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. క్రికెట్ చ‌రిత్ర‌లో 1000 సిక్స‌ర్లు దాటిన ఏకైక ప్లేయ‌ర్ గేల్ మాత్రమే. ఆ త‌ర్వాత పొలార్డ్ (758), ర‌సెల్ (510), బ్రెండ‌న్ మెక‌ల‌మ్ (485), షేన్ వాట్స‌న్ (467), ఏబీ డివిలియ‌ర్స్ (434) ఉన్నారు..

రోహిత్ సాధించిన మొత్తం 404 సిక్సర్లలో...టెస్టు మ్యాచ్ ల్లో సాధించిన 52, వన్డేల్లో 232, టీ-20లో 120 సిక్సర్లు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News