ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ కు దారేది?

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్ బెర్త్ లు మూడుస్తంభాలాటగా మారింది. ఆస్ట్ర్రేలియా, భారత్, శ్రీలంక ఫైనల్ రెండుబెర్త్ ల కోసం పోటీపడుతున్నాయి.

Advertisement
Update:2023-01-07 14:12 IST

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్లో భారత్ కు దారేది?

ఐసీసీ టెస్టు లీగ్ ఫైనల్ బెర్త్ లు మూడుస్తంభాలాటగా మారింది. ఆస్ట్ర్రేలియా, భారత్, శ్రీలంక ఫైనల్ రెండుబెర్త్ ల కోసం పోటీపడుతున్నాయి...

సాంప్రదాయ టెస్టు క్రికెట్లో ఐసీసీ నిర్వహిస్తున్న తొమ్మిదిజట్ల లీగ్ సమరం ఆసక్తికరంగా మారింది. న్యూజిలాండ్ తో పాకిస్థాన్, దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ జట్ల ఆఖరి టెస్టు మ్యాచ్ లు డ్రాగా ముగియడంతో లీగ్ టేబుల్ మొదటి నాలుగు స్థానాలలో ఆస్ట్ర్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంకజట్లు కొనసాగుతున్నాయి

ఆస్ట్ర్రేలియాకు ఫైనల్స్ బెర్త్ ఖాయం....

2021- 2023 ఐసీసీ టెస్టులీగ్ ఫైనల్ కు ఆస్ట్ర్రేలియాజట్టు అర్హత సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్లో రెండో బెర్త్ కోసం మాజీ రన్నరప్ భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికాజట్లు పోటీపడుతున్నాయి.

న్యూజిలాండ్ తో జరిగిన రెండుమ్యాచ్ ల సిరీస్ ను ఆతిథ్య పాకిస్థాన్ 0-0తో డ్రాగా ముగించడం, సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికా- ఆస్ట్ర్రేలియా జట్ల మధ్య జరిగిన ఆఖరి టెస్టు ..వానదెబ్బతో డ్రాగా ముగియడంతో..పాయింట్ల పట్టికలో స్వల్పంగా మార్పులు చోటు చేసుకొన్నాయి.

సిడ్నీటెస్టులో ఫలితం తేలకపోడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో మూడుమ్యాచ్ ల సిరీస్ ను ఆస్ట్ర్రేలియా 2-0తో కైవసం చేసుకోడం ద్వారా తన విజయాల శాతాన్ని 68 శాతానికి పెంచుకోగలిగింది.

బంగ్లాదేశ్ తో ఇటీవలే ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ లో క్లీన్ స్వీప్ విజయం సాధించిన భారత్ 58 పాయింట్ల విజయశాతంతో రెండోస్థానంలో కొనసాగుతోంది. కంగారూల చేతిలో 0-2తో టెస్టు సిరీస్ ను పోగొట్టుకొన్న దక్షిణాఫ్రికాజట్టు 49 పీసీటీ పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతోంది.

శ్రీలంకజట్టు ఇప్పటికే 53 పీసీటీ పాయింట్లు సాధించి పాయింట్ల పట్టిక మూడోస్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకజట్టు ప్రస్తుత సీజన్ టెస్టులీగ్ లో న్యూజిలాండ్ తో మరో రెండుమ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది.

లీగ్ టైటిల్ రేస్ నుంచి పాక్, న్యూజిలాండ్ అవుట్...

ఐసీసీ లీగ్ ప్రారంభ సీజన్ టైటిల్ విన్నర్ న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు 2023 సీజన్ టైటిల్ రేస్ నుంచి నిష్క్ర్రమించాయి. పాకిస్థాన్ తో జరిగిన రెండుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో న్యూజిలాండ్ జట్టు ఒక్క విజయమూ సాధించలేకపోయింది.

టెస్టు లీగ్ లో తలపడుతున్న మొత్తం తొమిదిజట్లు ఆరేసి సిరీస్ లు చొప్పున 16 టెస్టుల్లో తలపడాల్సి ఉంది. ఇందులో మూడు సిరీస్ లు స్వదేశంలో, మిగిలిన మూడు సిరీస్ లు విదేశాలలో ఆడాల్సి ఉంది.

లీగ్ ఫైనల్స్ బెర్త్ ఆశల్లో భారత్...

2023 టెస్ట్ లీగ్ లో ఆస్ట్ర్రేలియా టేబుల్ టాపర్ హోదాలో ఫైనల్స్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకోగలిగింది. మరోవైపు..ఫైనల్స్ రెండో బెర్త్ కోసం భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికాజట్ల నడుమ మూడుస్తంభాలాట మొదలయ్యింది.

ఆస్ట్ర్రేలియాతో స్వదేశీగడ్డపై జరుగనున్న నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ 4-0తోనూ, న్యూజిలాండ్ తో 2 మ్యాచ్ ల సిరీస్ ను శ్రీలంక 2-0తోనూ నెగ్గితే..ఆసియాజట్ల మధ్యనే టైటి్ల్ సమరం జరుగనుంది.

ఒకవేళ న్యూజిలాండ్ 2-0తో శ్రీలంకను చిత్తు చేయగలిగితే..భారత్ 2-0తో ఆస్ట్ర్రేలియాను ఓడించినా ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోగలుగుతుంది. అదే..ఆస్ట్ర్రేలియా చేతిలో భారత్, న్యూజిలాండ్ చేతిలో శ్రీలంకజట్లు ఓడితే..లీగ్ టైటిల్ సమరంలో ఆస్ట్ర్ర్రేలియా, దక్షిణాఫ్రికాజట్లు తలపడే అవకాశం ఉంది.

2023 ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత ఇంగ్లండ్ లోని ఓవల్ వేదికగా టెస్టు లీగ్ టైటిల్ సమరాన్ని నిర్వహించనున్నారు.

టెస్టులీగ్ లో ఇంగ్లండ్ 46.97 విజయశాతంతో 5వ స్థానంతో తన పోటీ ముగించింది. పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు సైతం ఫైనల్స్ బెర్త్ రేస్ నుంచి వైదొలిగాయి.న్యూజిలాండ్ 8, పాకిస్థాన్ 9 స్థానాలతో సరిపెట్టుకొన్నాయి.

ఫైనల్స్ లోని రెండు బెర్త్ ల్లో ఆస్ట్ర్రేలియాకు ఓ స్థానం ఖాయం కాగా..మరో బెర్త్ కోసం భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక పోటీపడనుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత్ ఫైనల్స్ చేరాలంటే...టేబుల్ టాపర్ ఆస్ట్ర్రేలియాతో జరిగే నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో కనీసం రెండుమ్యాచ్ లు నెగ్గితీరాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News