వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా హంపి

చైనా గ్రాండ్‌ మాస్టర్‌ జు వెంజున్‌ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా ఘనత సాధించిన హంపి

Advertisement
Update:2024-12-29 08:19 IST

వరల్డ్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ర్యాపిడ్‌ ఛాంపియన్‌గా కోనేరు హంపి నిలిచింది. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి విజయం సాధించింది. 2019లోనూ హింపి ఛాంపియన్‌ అయింది. చైనా గ్రాండ్‌ మాస్టర్‌ జు వెంజున్‌ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్‌గా హంపి ఘనత సాధించింది. మరో తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ఐదో స్థానంలో నిలిచింది.

పురుషుల విభాగంలో తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి అగ్రస్థానంలో ఉన్న భారత గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి చివర్లో వెనుకబడిపోయాడు. పురుషుల ర్యాపిడ్‌ ఈవెంట్‌లో 18 ఏల్ల వోలాదర్‌ ముర్టిన్‌ విజేతగా నిలిచాడు. రష్యాకు చెందిన ఈ యువ గ్రాండ్‌ మాస్టర్‌ 10 పాయింట్లు సాధించి ఛాంపియన్‌గా అవతరించాడు. అర్జున్‌ (9 పాయింట్లు) ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

Tags:    
Advertisement

Similar News