యూఎస్‌ ఓపెన్-2023 విజేత జకోవిచ్..మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డ్‌ సమం

సెర్బియన్‌ టెన్నిస్ లెజెండ్‌ నోవాక్‌ జకోవిచ్‌ చరిత్ర సృష్టించాడు. మెన్స్‌ సింగిల్స్‌లో ఇప్పటికే అత్యధిక టైటిల్స్ సాధించిన జకోవిచ్‌...తాజాగా యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో రష్యా ప్లేయర్‌ మెద్వెదెవ్‌ను చిత్తు చేసి..24వ గ్రాండ్‌ స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Advertisement
Update:2023-09-11 08:41 IST

సెర్బియన్‌ టెన్నిస్ లెజెండ్‌ నోవాక్‌ జకోవిచ్‌ చరిత్ర సృష్టించాడు. మెన్స్‌ సింగిల్స్‌లో ఇప్పటికే అత్యధిక టైటిల్స్ సాధించిన జకోవిచ్‌...తాజాగా యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో రష్యా ప్లేయర్‌ మెద్వెదెవ్‌ను చిత్తు చేసి..24వ గ్రాండ్‌ స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టెన్నిస్‌లో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డును సమం చేశాడు.

యూఎస్ ఓపెన్‌ ఫైనల్ మ్యాచ్‌ నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతుందని అంతా భావించినా..మెద్వెదెవ్‌ను వరుసగా మూడు సెట్లలో మట్టి కరిపించాడు జకోవిచ్‌. 6-3, 7-6(7-5), 6-3 తేడాతో మెద్వెదేవ్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచాడు. 2021లో ఇదే యూఎస్‌ ఫైనల్‌లో తనను ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకున్న మెద్వెదెవ్‌పై..ఈసారి జకోవిచ్ ప్రతీకారం తీర్చుకున్నాడు.

మొదటి సెట్‌ను 6-3 తేడాతో సొంతం చేసుకున్న జకోవిచ్‌కు...రెండో సెట్‌లో మెద్వెదెవ్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. రెండో సెట్‌లో జకోవిచ్‌ ఓటమి తప్పదన్న రీతిలో మెద్వెదెవ్‌ పోటీ ఇచ్చాడు. ఐతే ఒక్కసారిగా జకోవిచ్ పుంజుకోవడంతో స్కోర్‌ 6-6 సమం అయింది. ఈ టైంలో అద్భుతంగా ఆడిన జకో 7-6 తేడాతో రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక కీలకమైన మూడో సెట్‌లో మెద్వెదెవ్ చేతులెత్తేశాడు. దీంతో జకోవిచ్‌ 6-3 తేడాతో మూడో సెట్‌ గెలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. దాదాపు 3 గంటల 17 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది. ఈ ఏడాది జరిగిన నాలుగు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌కు చేరిన జకో..ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, తాజాగా యూఎస్‌ ఓపెన్‌లో విజయం సాధించాడు. వింబుల్డన్‌లో మాత్రం కార్లోస్‌ అల్కరాస్‌ చేతిలో ఓడిపోయాడు.

Tags:    
Advertisement

Similar News