కాన్వే దనాదన్‌ బ్యాటింగ్‌

వికెట్‌ నష్టపోయి 82 పరుగులు చేసిన న్యూజిలాండ్‌

Advertisement
Update:2024-10-17 15:15 IST

కాన్వే దనాదన్‌ బ్యాటింగ్‌ తో ఇండియాతో జరుగుతోన్న ఫస్ట్‌ టెస్ట్‌ లో న్యూజిలాండ్‌ పట్టు బిగించే దిశగా సాగుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన భారత జట్టు ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ లో కేవలం 46 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ కు దిగిన కివీస్‌ ఓపెనర్లు దేవన్‌ కాన్వే, టాప్‌ లాథమ్‌ దాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. కాన్వే 64 బాల్స్‌ లో తొమ్మిది ఫోర్లు, సిక్సర్‌ తో 61 పరుగులతో క్రీజ్‌ లో ఉన్నారు. లాథమ్‌ కుల్దీప్‌ బౌలింగ్‌ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 15 పరుగులు చేసి లాథమ్‌ పెవిలియన్‌ కు చేరాడు. విల్‌ యంగ్‌ ఐదు పరుగులతో క్రీజ్‌ లో ఉన్నారు. రెండో రోజు ఆటలో టీ విరామ సమయానికి కివిస్‌ జట్టు వికెట్‌ కోల్పోయి 82 పరుగులు చేసింది. ఇండియాపై 36 పరుగుల ఆదిక్యంలో ఉంది.

Tags:    
Advertisement

Similar News