బాక్సింగ్‌ డే టెస్ట్‌.. భారత్‌ టార్గెట్‌ 340

రెండో ఇన్సింగ్స్‌లో 5 వికెట్లు తీసిన బూమ్రా

Advertisement
Update:2024-12-30 05:23 IST

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది. 228/9 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఐదోరోజు ఆట ప్రారంభించిన ఆతిథ్య జట్టు 234 రన్స్‌కు ఆలౌటైంది. చివరి వికెట్‌ బూమ్రా తీశాడు. ఐదో రోజు మొదటి ఓవర్‌ సిరాజ్‌ వేశాడు. బూమ్రా రెండో ఓవర్‌లోనే లయన్‌ను బౌల్డ్‌ చేసి ఆసీస్‌ను ఆలౌట్‌ చేశాడు. మొత్తంగా 339 రన్స్‌ ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్సింగ్స్‌లో లబు షేన్‌ (70) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో జస్‌ప్రీత్‌ బూమ్రా 5, సిరాజ్‌ 3, జడేజా ఒక వికెట్‌ పడగొట్టారు. ఈ టెస్టులో భారత్‌ గెలవాలంటే 340 రన్స్‌ చేయాలి.భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. ఐదు ఓవర్లు ముగిసే సరికి రోహిత్‌ శర్మ (1*), జైశ్వాల్‌ (6*) క్రీజులో ఉన్నారు. భారత్‌ విజయానికి ఇంకా 333 రన్స్‌ కావాలి.

Tags:    
Advertisement

Similar News