టీమిండియా భారీ స్కోరు
సఫారీ జట్టుతో ఆడుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో సెంచరీతో విజృంభించిన సంజు శాంసన్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టీ20 లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 202 రన్స్ చేసింది. ఓపెనర్ సంజు శాంసన్ (107) సెంచరీతో అదరగొట్టాడు. తిలక్ వర్మ (33), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (21) రాణించారు. సఫారీ బౌలర్లలో గెరాల్డ్ 3, మార్కో, కేశవ్, పీటర్, పాట్రిక్ చెరో వికెట్ పడగొట్టారు.
శాంసన్ అరుదైన రికార్డు
టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ 47 బాల్స్‌లోనే 9 సిక్స్‌లు, 7 ఫోర్లతో సెంచరీ చేశాడు. దీంతోరెండు వరుస టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా సంజు రికార్డు సృష్టించారు. ఇటీవల హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో సెంచరీ (111) చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా టీ20లో దక్షిణాఫ్రికాపై టీమిండియాకు (202/) అత్యధిక స్కోరు కావడం విశేషం.