భారీ రికార్డుకు భువనేశ్వర్ కుమార్ గురి!

భారత స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. న్యూజిలాండ్ తో ఈ రోజు ప్రారంభమయ్యే తీన్మార్ టీ-20 సిరీస్ ద్వారా భువీ అత్యధిక వికెట్ల రికార్డును అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

Advertisement
Update:2022-11-18 09:33 IST

భువనేశ్వర్ కుమార్

భారత స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. న్యూజిలాండ్ తో ఈ రోజు ప్రారంభమయ్యే తీన్మార్ టీ-20 సిరీస్ ద్వారా భువీ అత్యధిక వికెట్ల రికార్డును అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు...

స్వింగ్ బౌలింగ్ లో మొనగాడు, టీ-20 ఫార్మాట్లో స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్...కివీ గడ్డపై ఓ అరుదైన రికార్డుకు ఉరకలేస్తున్నాడు. న్యూజిలాండ్ తో ఈ రోజు ప్రారంభమయ్యే తీన్మార్ టీ-20 సిరీస్ ద్వారా..క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక వికట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా నిలవాలన్న పట్టుదలతో ఉన్నాడు.

భువీకి కివీ వాతావరణం అనుకూలం..

న్యూజిలాండ్ లోని శీతల వాతావరణం, గ్రీన్ టాప్ పిచ్ లు..స్వింగ్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ కు అత్యంత అనువుగా ఉంటాయి. కుదురైన లైన్ -లెంగ్త్ కు ఇన్,అవుట్ స్వింగర్లను జోడిస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో భువీకి భువీ మాత్రమే సాటి.

85 మ్యాచ్ ల్లో 89 వికెట్లు...

తన టీ-20 కెరియర్ లో ఇటీవలే ముగిసిన ప్రపంచకప్ సెమీఫైనల్స్ వరకూ భారత్ తరపున 85 మ్యాచ్ లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 85 వికెట్లు పడగొట్టాడు. వీటిలో సగానికి పైగా వికెట్లు పవర్ ప్లే ఓవర్లలో పడగొట్టినవే కావడం మరో విశేషం.

ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ లో ఇప్పటి వరకూ 30 మ్యాచ్ ల్లో 36 వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్ తో మూడుమ్యాచ్ ల సిరీస్ లో భువీ మరో నాలుగు వికెట్లు పడగొట్టగలిగితే..ఐర్లాండ్ బౌలర్ జోషువా లిటిల్ పేరుతో ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును అధిగమించగలుగుతాడు.

2022 టీ-20 ప్రపంచకప్ లో హ్యాట్రిక్ నమోదు చేసిన ఇద్దరు బౌలర్లలో ఒకడిగా నిలిచిన జోషువా లిటిల్ 39 వికెట్లతో బౌలర్ నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.

36 వికెట్లతో భువీ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

న్యూజిలాండ్ తో జరిగే తీన్మార్ టీ-20, వన్డే సిరీస్ ల్లో వెటరన్ భువనేశ్వర్ కుమార్ భారత తురుపుముక్క కానున్నాడు.

Tags:    
Advertisement

Similar News