బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో పాండ్యాకు డబుల్ ప్రమోషన్?
బీసీసీఐ వార్షిక ప్లేయర్ల కాంట్రాక్టు ప్రకటనకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. డాషింగ్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు డబుల్ ప్రమోషన్ దక్కనుంది.
బీసీసీఐ వార్షిక ప్లేయర్ల కాంట్రాక్టు ప్రకటనకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. డాషింగ్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు డబుల్ ప్రమోషన్ దక్కనుంది.
భారత అగ్రశ్రేణి క్రికెటర్లకు బీసీసీఐ ఇచ్చే వార్షిక కాంట్రాక్టుల్లో డాషింగ్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా డబుల్ ప్రమోషన్ దక్కించుకోడం ఖాయంగా కనిపిస్తోంది.
అజింక్యా రహానే, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ సైతం 2023 వార్షిక కాంట్రాక్టుల ద్వారా భారీగా లబ్దిపొందనున్నారు.
గత సీజన్ వరకూ ఆటగాళ్ల స్థాయిని బట్టి బీసీసీఐ 7 కోట్ల రూపాయల నుంచి కోటి రూపాయల వరకూ..ఆడినా..ఆడకున్నా ఏడాదికి కాంట్రాక్టు మనీ చెల్లిస్తూ వస్తోంది.
మాజీ కెప్టెన్ అజింక్యా రహానే, వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ, టెస్టు స్పెషలిస్టు హనుమ విహారీలకు బీసీసీఐ తన వార్షిక కాంట్రాక్టును ఉపసంహరించుకోనుంది.
నాలుగు తరగతులుగా కాంట్రాక్టు..
క్రికెటర్ల అర్హత, భారతజట్టుకు అందిస్తున్న సేవలకు అనుగుణంగా నాలుగు తరగతులుగా కాంట్రాక్టు ఇస్తూ వస్తోంది. ఏ- ప్లస్ కాంట్రాక్టు కింద ఏడాదికి 7 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, జస్ ప్రీత్ బుమ్రా ఈ తరగతిలో ఉన్నారు.
ఏ, బీ, సీ క్యాటగిరీ కాంట్రాక్టుల కింద ఏడాదికి 5 కోట్లు, 3 కోట్లు, కోటి రూపాయలు చొప్పున బీసీసీఐ చెల్లిస్తోంది.
గత సీజన్లో మొత్తం 28 మంది క్రికెటర్లను కాంట్రాక్టుల కోసం ఎంపిక చేసింది.
పాండ్యాకు డబుల్ ప్రమోషన్..
టీ-20, వన్డే ఫార్మాట్లలో భారత్ కు వెన్నెముక లాంటి ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు డబుల్ ప్రమోషన్ ఇవ్వనుంది. ప్రస్తుతం సీ- గ్రేడ్ కాంట్రాక్టులో ఉన్న హార్ధిక్ పాండ్యా..ఏ- గ్రేడ్ కు ప్రమోట్ కానున్నాడు. లెఫ్టామ్ స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సైతం ప్రమోషన్ పొందనున్నాడు.
యువఓపెనర్ శుభమన్ గిల్ గ్రేడ్-బీకి ప్రమోట్ కానున్నాడు. అయితే..ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను ప్రస్తు బీ-గ్రేడ్ నుంచి సీ- గ్రేడ్ కు డిమోట్ చేయనున్నారు.
వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులను ఖరారు చేయనుంది.
భారత మాజీ కెప్టెన్ అజింక్యా రహానే, వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా వార్షిక కాంట్రాక్టును కోల్పోనున్నట్లు భావిస్తున్నారు.
2023 ఐసీసీ వన్డే ప్రపంచకప్, 2024 లో ఐసీసీ టీ-20 ప్రపంచకప్ టోర్నీలు జరుగనున్న దృష్ట్యా 29 సంవత్సరాల హార్ధిక్ పాండ్యాకు బీసీసీఐ అధికప్రాధాన్యం ఇస్తోంది.
వార్షిక కాంట్రాకుల వివరాలను బీసీసీఐ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.