149 పరుగులకే బంగ్లాదేశ్‌ ఆల్‌ ఔట్‌

227 పరుగుల ఆదిక్యంలో టీమ్‌ ఇండియా

Advertisement
Update:2024-09-20 15:23 IST

భారత్‌ తో జరుగుతోన్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ లో బంగ్లాదేశ్‌ 149 పరుగులకే ఆల్‌ ఔట్‌ అయ్యింది. చెన్నైలో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ రెండో రోజు బంగ్లా టీమ్‌ వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జస్ప్రీత్‌ బూమ్రా బాల్‌ తో నిప్పులు చెరగడంతో బంగ్లా వెన్ను విరిగింది. మొదటి టెస్ట్‌ రెండో రోజు ఇన్నింగ్స్‌ ను ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 339/6 తో బ్యాటింగ్‌ మొదలు పెట్టిన భారత్‌ మరో 37 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు చేజార్చుకుంది. సెంచరీ చేస్తాడని అనుకున్న రవీంద్ర జడేజా ఈ రోజు అదనంగా ఒక్క పరుగు చేయకుండానే ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత ఆకాశ్‌ దీప్‌, అశ్విన్‌, బూమ్రా వికెట్లు పడటంతో 376 పరుగులకు టీమ్‌ ఇండియా ఆల్‌ ఔట్‌ అయ్యింది. బంగ్లా బౌలర్లలో హసన్‌ హమద్‌ ఐదు, టస్కిన్‌ అహ్మద్‌ మూడు వికెట్లు పడగొట్టారు. నహీద్‌ రాణా, హసన్‌ మిరాజ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. బంగ్లా జట్టులో షకీబ్‌ ఉల్‌ హసన్‌ 32, లిటన్‌ దాస్‌ 22, కెప్టెన్‌ సాంటో 20 పరుగులు చేశారు. హసన్‌ మిరాజ్‌ 27 పరుగులు, టస్కిన్‌ అహ్మద్‌, నహీద్‌ రాణా 11 పరుగుల చొప్పున చేశారు. భారత బౌలర్లలో బూమ్రా నాలుగు, సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. బంగ్లాదేశ్‌ ఫాలో ఆన్‌ లో పడటంతో భారత్‌ రెండో ఇన్నింగ్‌ మొదలు పెడుతుందా.. బంగ్లాదేశ్‌ తో ఫాలో ఆన్‌ ఆడిస్తుందా అనేది కాసేపట్లో తేలనుంది.

Tags:    
Advertisement

Similar News