43 ఏళ్ళ వయసులో ప్రపంచ 'నంబర్ వన్'!

భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోహన్ బొపన్న చరిత్ర సృష్టించాడు. ప్రతిభకు వయసు ఏమాత్రం అవరోధం కాదని మరోసారి నిరూపించాడు. 43 ఏళ్ళ వయసులో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు....

Advertisement
Update:2024-01-24 14:41 IST

భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రోహన్ బొపన్న చరిత్ర సృష్టించాడు. ప్రతిభకు వయసు ఏమాత్రం అవరోధం కాదని మరోసారి నిరూపించాడు. 43 ఏళ్ళ వయసులో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు....

మంచి వయసులో ఉంటేనే ఏదైనా సాధించగలమనే భావనకు కాలం చెల్లింది. మనసుండాలే కానీ వయసు మీరినా అరుదైన ఘనతలు, అసాధారణ లక్ష్యాలు సాధించగలమని వివిధ క్రీడలకు చెందిన పలువురు దిగ్గజ క్రీడాకారులు ప్రపంచానికి చాటి చెబుతూనే ఉన్నారు.

గ్లోబల్ గేమ్ టెన్నిస్ లో సైతం ప్రతిభకు వయసు ఏమాత్రం అడ్డంకి కాదని, లేటు వయసులోనూ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించగలమని భారత టె్న్నిస్ ఆల్ టైమ్ గ్రేట్ డబుల్స్ ప్లేయర్లలో ఒకరైన రోహన్ బొపన్న నిరూపించాడు.

20 సంవత్సరాలుగా....

భారత టెన్నిస్ కు గత 20 శతాబ్దాలుగా సింగిల్స్, డబుల్స్ ఆడుతూ అసమాన సేవలు అందిస్తూ వస్తున్న రోహన్ బొపన్న కెరియర్ చరమాంకంలో ప్రపంచ నంబర్ వన్ డబుల్స్ ర్యాంక్ ప్లేయర్ గా నిలవడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్ చేరడం ద్వారా నంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకొన్నాడు. ఆస్ట్ర్రేలియన్ ఓపెన్లో

పట్టువదలని విక్రమార్కుడి తరహాలో పాల్గొంటూ వస్తున్న రోహన్ తన 17వ ప్రయత్నంలో కానీ సెమీఫైనల్స్ చేరుకోలేకపోయాడు.

వరుస సెట్ల విజయంతో సెమీస్ కు...

ఆస్ట్ర్రేలియాకు చెందిన మాథ్యూ ఇబెడెన్ తో జంటగా గత ఏడాదిగా ప్రపంచ టెన్నిస్ డబుల్స్ లో పాల్గొంటూ వస్తున్న రోహన్ బొపన్న ఎట్టకేలకు ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ శిఖరాన్ని అధిరోహించగలిగాడు.

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో 2వ ర్యాంక్ రోహన్ బొపన్న జోడీ వరుస సెట్లలో 6-4, 7-6తో అర్జెంటీనాకు చెందిన 3వ సీడ్ జోడీ మాక్సిమో గోంజాలేజ్- యాండెర్స్ మోల్టెనీని గంటా 46 నిముషాలలో చిత్తు చేశారు.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ కు చేరుకోడంతోనే రోహన్ వ్యక్తిగత ర్యాంకింగ్ ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేరిపోయింది. 2023-అమెరికన్ ఓపెన్ డబుల్స్ ఫైనల్స్ చేరడం ద్వారా..అత్యంత పెద్దవయసులో ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్స్ చేరిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన రోహన్ కొద్ది మాసాల వ్యవధిలోనే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సైతం సాధించి చరిత్ర సృష్టించగలిగాడు.

ప్రస్తుత ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ ప్రారంభంనాటికి 3వ ర్యాంక్ లో ఉన్న రోహన్ 4వ రౌండ్ విజయంతో 2వ ర్యాంక్, సెమీస్ చేరుకోడం ద్వారా టాప్ ర్యాంక్ కు చేరుకోగలిగాడు. రోహన్ భాగస్వామి ఇబెడన్ రెండోర్యాంకులో కొనసాగుతున్నాడు.

గత 17 సంవత్సరాలుగా ఆస్ట్ర్ర్రేలియన్ ఓపెన్ లో పాల్గొంటూ వస్తున్న రోహన్ సెమీస్ చేరడం ఇదే మొదటిసారి. ఫైనల్లో చోటు కోసం జరిగే పోరులో అన్ సీడెడ్ జోడీ థామస్ మచాక్- జీజెన్ జాంగ్ లతో రోహన్ జోడీ తలపడాల్సి ఉంది.

రాజీవ్ రామ్ ను మించిన రోహన్...

అమెరికాలోని భారత సంతతి డబుల్స్ ప్లేయర్ 2022 సీజన్లో తన 38వ ఏట ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన అత్యంత పెద్దవయస్కుడైన ఆటగాడిగా నెలకొల్పిన రికార్డును 43 సంవత్సరాల వయసులో అధిగమించడం ద్వారా రోహన్ బొపన్న సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

2013లో అత్యుత్తమంగా 3వ ర్యాంక్ సాధించిన రోహన్ బొపన్న కేవలం ఏడాదివ్యవధిలోనే ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించడం ద్వారా మరో ముగ్గురు భారత దిగ్గజాల సరసన నిలువగలిగాడు.

భారత టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించిన ప్లేయర్లలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జా ఉన్నారు. ఇప్పటి వరకూ పురుషుల డబుల్స్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ లో నిలిచిన అమెరికా ఆటగాడు ఆస్టిన్ క్రైచిక్- ఇవాన్ డోడిగ్ ల స్థానాన్ని రోహన్ - మాథ్యూ జోడీ భర్తీ చేయనున్నారు.

2017 ఫ్రెంచ్ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ లో కెనడాకు చెందిన గాబ్రియెల్ డాబ్రోవస్కీతో జంటగా మిక్సిడ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన రోహన్..యూఎస్ ఓపెన్లో 2010, 2023 టోర్నీలలో రన్నరప్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇండియన్ వెల్స్ మాస్టర్స్ 1000 టోర్నీలో మాథ్యూ ఇబెడెన్ తో జంటగా టైటిల్ నెగ్గడం ద్వారా 43 సంవత్సరాల వయసులో ఈ ఘనత సాధించిన రికార్డు సైతం రోహన్ పేరుతోనే ఉంది.

Tags:    
Advertisement

Similar News