హిందూదేవుడి లోగోతో ఆసియా అథ్లెటిక్స్ మీట్!

బ్యాంకాక్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ను ఓ హిందూ దేవుడి లోగోతో నిర్వహించనున్నారు.

Advertisement
Update:2023-07-11 21:00 IST

హిందూదేవుడి లోగోతో ఆసియా అథ్లెటిక్స్ మీట్!

బ్యాంకాక్ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న 25వ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ను ఓ హిందూ దేవుడి లోగోతో నిర్వహించనున్నారు...

అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే సమయంలో రకరకాల లోగో (శుభ సూచిక)లు ఆయా నిర్వాహక సంఘాలు ఎంపిక చేయటం సహజం. అయితే...బౌద్ధమతానికి అధిక ప్రాధాన్యమిచ్చే థాయ్ లాండ్ మాత్రం ఓ హిందూదేవుడి లోగోను తాను నిర్వహించే ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ శుభసూచికగా ఎంచుకొంది.

జై హనుమాన్ అంటున్న థాయ్ లాండ్...

ఆసియా అథ్లెటిక్స్ సమాఖ్య ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం నుంచి మూడురోజులపాటు జరిగే 25వ ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ కు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని థాయ్ లాండ్ దక్కించుకొంది.

ఆసియా ఖండంలోని 45కు పైగా దేశాలజట్లు తలపడే ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లోగోగా..హిందూ దేవుడు, జై భజరంగబలి లార్డ్ హనుమాన్ చిత్రాన్ని థాయ్ లాండ్ అథ్లెటిక్స్ సమాఖ్య ఎంపిక చేసింది.

బలానికి, వేగానికి, బుద్ధి కుశలతకు, ఓర్పు నేర్పులకు ప్రతీకగా భావించే హిందూ దేవుడు హనుమాన్ ను ఎంపిక చేసి సంచలనం సృష్టించింది. అంకితభావం, విశ్వాసాలకు హనుమాన్ మరోపేరని, ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ మీట్ లో పాల్గొనే అథ్లెట్లందరూ వాయుపుత్రుని స్ఫూర్తితో పోటీలలో పాల్గొనాలని నిర్వాహక సంఘం ఆకాంక్షించింది.

భారీబృందంతో భారత్...

ఈ పోటీలలో భారత్ సైతం భారీబృందంతో బరిలోకి దిగుతోంది. షాట్ పుట్టర్ తేజిందర్ పాల్ సింగ్ టూర్, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ సరికొత్త రికార్డులతో పతకాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బుధవారం నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ పోటీలలో పాల్గొనటానికి భారత అథ్లెట్లు బెంగళూరు నుంచి ఢిల్లీ మీదుగా బ్యాంకాక్ కు చేరుకోనున్నారు. ఈ పోటీలలో రాణించిన అథ్లెట్లకే సెప్టెంబర్లో చైనా వేదికగా జరుగనున్న ఆసియాక్రీడల్లో పాల్గొనే అర్హత దక్కనుంది.

Tags:    
Advertisement

Similar News