హర్షిత్‌కు 4 వికెట్లు.. టీమిండియా టార్గెట్‌ 241

ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌, భారత్‌ మధ్య రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో సామ్‌ కొన్‌స్టాప్‌ సెంచరీ

Advertisement
Update:2024-12-01 13:19 IST

కాన్‌బెరా వేదికగా భారత్‌తో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌ 240 రన్స్‌కు ఆలౌటైంది. భారత్‌కు 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సామ్‌ కొన్‌స్టాప్‌ (107) సెంచరీతో జాకోబ్స్‌ (61) జాక్‌ క్లేటన్‌ (40) రన్స్‌తో రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్‌ రాణా 4 వికెట్లు.. ఆకాశ్‌ దీప్‌ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ, సిరాజ్‌, జడేజా, సుందర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌, భారత్‌ మధ్య రెండు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో ఒకరోజు వర్షార్పణం అయిపోయింది. రెండోరోజు ఆదివారం టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నది. ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇరు జట్లు ఇవాళ 50 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ ఆడనున్నాయి.

ఏడు రన్స్‌ వ్యవధిలో ఐదు వికెట్లు

ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే మాథ్యురెన్‌షా (5), జేడెన్‌ గుడ్విన్‌ (4) లను భారత బౌలర్లు పెవిలియన్‌కు పంపారు. దంతో పీఎం ఎలెవన్‌ 22 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కాన్స్‌టన్‌, క్లేటన్‌ జోడి నిలకడగా ఆడి ఇన్సింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో పీఎం ఎలెవన్‌ 22 ఓవర్లకు 124/2 స్కోరుతో స్టాండ్‌ అయ్యింది. ఈ దశలో క్లేటన్‌, ఆలివర్‌ డేవిస్‌ (0)ను హర్షిత్‌ రాణా మూడు బాల్స్‌ వ్యవధిలో పెవిలియన్‌కు పంపి టీమిండియాకు ఉపశమనాన్ని కలిగించాడు. హర్షిత్‌ తన తర్వాత ఓవర్‌లో జాక్‌ ఎడ్వర్డ్‌ (1), సామ్‌ హార్పర్‌ (0) వెనక్కి పంపాడు. కొద్దిసేపటికే ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో ఐడాన్‌ (4) నితీశ్‌కు చిక్కాడు. దీంతో ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌ ఏడు రన్స్‌ వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది.

వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆసీస్‌ దేశవాళీ జట్టు 150-160 లోపే ఆలౌట్‌ అవుతుందని అనుకున్నారు. కానీ తొమ్మిదో స్థానంలో వచ్చిన హన్నో జాకబ్స్‌.. కాన్స్‌టస్‌కు ఎక్కువగా స్ట్రైకింగ్‌ ఇవ్వకుండా వేగంగా రన్స్‌ రాబట్టాడు. ఈ జోడి ఎనిమిదో వికెట్‌కు 67 రన్స్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 90 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేసుకున్న కాన్స్‌టస్‌ ఆకాశ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. జాకబ్స్‌ చివరి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.


Tags:    
Advertisement

Similar News