కబడ్డీ లీగ్ లో 1000వ మ్యాచ్!
దేశవిదేశాలలోని కోట్లాదిమంది క్రీడాభిమానులను గత దశాబ్దకాలంగా ఓలలాడిస్తూ వస్తున్న ప్రీమియర్ కబడ్డీలీగ్ లో సరికొత్త రికార్డు నమోదయ్యింది.
దేశవిదేశాలలోని కోట్లాదిమంది క్రీడాభిమానులను గత దశాబ్దకాలంగా ఓలలాడిస్తూ వస్తున్న ప్రీమియర్ కబడ్డీలీగ్ లో సరికొత్త రికార్డు నమోదయ్యింది.
భారత గ్రామీణక్రీడ కబడ్డీకి ఆధునిక రూపమే ప్రీమియర్ కబడ్డీ లీగ్. మనదేశంలో ఐపీఎల్ తరువాత అత్యధిక అభిమానులు, జనాదరణ పొందుతున్నటోర్నీగా గుర్తింపు సంపాదించింది.
2014 నుంచి 2024 వరకూ...
2014లో ప్రారంభమైన కబడ్డీ లీగ్ గత దశాబ్దకాలంలో అంతైఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోతూ వచ్చింది. కోట్లాదిమంది అభిమానులను కదిపి కుదిపేస్తున్న ఈ లీగ్ ప్రస్తుత 2024 సీజన్లో దశాబ్దకాలం పూర్తి చేసుకొంది.
జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా బెంగాల్ వారియర్స్ తో బెంగళూరు బుల్స్ తలపడడంతో కబడ్డీ లీగ్ చరిత్రలో 1000 మ్యాచ్ ల రికార్డు నమోదయ్యింది.
నువ్వానేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో చివరకు బెంగాల్ వారియర్స్ 35-29 స్కోరుతో బెంగళూరును ఓడించింది.
బెంగాల్ వారియర్స్ రైడర్లలో మనిందర్ సింగ్ 9 పాయింట్లు, డిఫెండర్ శుభం షిండే 7 ట్యాకిల్ పాయింట్లు సాధించడం ద్వారా తమజట్టు విజయంలో ప్రధానపాత్ర వహించారు.
బెంగళూరు బుల్స్ ఆటగాళ్లలో భరత్, సుర్జిత్ సింగ్ పోరాడి ఆడినా ప్రయోజనం లేకపోయింది.
మరో పోటీలో ఆతిథ్య జైపూర్ పింక్ పాంథర్స్ 31-29 పాయింట్లతో యూ-ముంబాను అధిగమించింది. జైపూర్ ఆటగాళ్లలో అర్జున్ దేశ్ వాల్ 11 పాయింట్లు, యూ-ముంబా రైడర్లలో గుర్మాన్ సింగ్ 10 పాయింట్లు సాధించారు.
10 జట్లు ...మ్యాచ్ ల సమరం...
ప్రస్తుత 2024 సీజన్ లీగ్ లో తలపడుతున్న జట్లలో జైపూర్ పింక్ పాంథర్స్, బెంగళూరు బుల్స్, యూ-ముంబా, పాట్నా పైరేట్స్, బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ,
గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, పునేరీ పల్టాన్, తమిళ్ తలైవాస్, తెలుగు టైటాన్స్, యూపీ యోధాస్ ఉన్నాయి.
రౌండ్ రాబిన్ లీగ్ మొదటి 13 రౌండ్ల పోటీలు ముగిసే సమయానికి పూనేరీ పల్టాన్ 10 విజయాలు, జైపూర్ పింక్ పాంథర్స్ 9 విజయాలు, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ చెరో 7 విజయాలతో మొదటి మూడుస్థానాలలో కొనసాగుతున్నాయి.
ఫిబ్రవరి ఆఖరి వారం తో ఈ లీగ్ 11వ సీజన్ కు తెరపడనుంది. గత పది సంవత్సరాల కాలంలోనే 1000 మ్యాచ్ ల రికార్డును సాధించగలిగింది.