న్యూస్ స్టోరీస్, యానిమేటెడ్ బటన్స్.. యూట్యూబ్‌లో కొత్త ఫీచర్లు!
వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబ్ తరచూ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ.. యూజర్లను ఎంగేజ్ చేస్తుంటుంది.
వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబ్ తరచూ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ.. యూజర్లను ఎంగేజ్ చేస్తుంటుంది. లేటెస్ట్‌గా యూట్యూబ్‌లో కొన్ని కొత్త ఫీచర్లు యాడ్ అయ్యాయి.
ఫాస్ట్ ఫార్వాడ్ స్పీడ్, యూ ట్యాబ్, యానిమేటెడ్ బటన్స్.. వంటి కొత్త ఫీచర్లు యూట్యూబ్‌లో అందుబాటులోకి వచ్చాయి. అవెలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫాస్ట్ ఫార్వర్డ్ స్పీడ్
మామూలుగా యూట్యూబ్ వీడియోను స్పీడ్ పెంచి, తగ్గించి చూసేందుకు ‘ప్లేబ్యాక్ స్పీడ్’ అనే ఫీచర్ ఉంది. అయితే ఆ స్పీడ్ మొత్తం వీడియోకి వర్తిస్తుంది. అలాకాకుండా వీడియోలో కొంత పార్ట్‌ను ఫాస్ట్ ఫార్వర్డ్ స్పీడ్‌లో చూసేందుకు యూట్యూబ్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. వీడియో మీద రెండు సార్లు ట్యాప్ చేస్తే వీడియో పది సెకన్లు ముందుకు వెళ్తుంది కదా.. అయితే రెండు సార్లు ట్యాప్ చేసి అలాగే హోల్డ్ చేసి ఉంచితే.. వీడియో 2ఎక్స్ స్పీడ్‌లో ప్లే అవుతుంది. వేలు తీసేస్తే మళ్లీ నార్మల్ స్పీడ్‌లో ప్లే అవుతుంది.
యూ ట్యాబ్
యూట్యూబ్ యాప్‌లో సరికొత్త యూ ట్యాబ్ చేరింది. లైబ్రరీ ట్యాబ్, అకౌంట్ పేజీని కలిపి ఈ ట్యాబ్ డిజైన్ చేశారు. యూ ట్యాబ్ సెక్షన్లో చూసిన వీడియోల హిస్టరీ, సేవ్ చేసిన ప్లే లిస్ట్‌లు, డౌన్లోడ్స్, అకౌంట్ సెట్టింగ్స్, ఛానెల్ ఇన్ఫర్మేషన్ వంటివన్నీ ఒకేచోట ఉంటాయి.
యానిమేటెడ్ బటన్స్
క్రియేటర్స్ కోసం యూట్యూబ్ ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. సాధారణంగా క్రియేటర్లు వీడియోల్లో.. లైక్, కామెంట్, సబ్‌స్క్రైబ్ చేయమని చెప్తుంటారు. అలాంటివి చెప్పేటప్పుడు ఆటోమేటిక్‌గా ఆయా సింబల్స్ వీడియోపై కనిపించేలా యూట్యూబ్ ఫీచర్ యాడ్ చేసింది. వీడియో ప్లే అయ్యేటప్పుడు అదే సింక్‌లో ఆయా బటన్స్ కనిపిస్తాయి. అలాగే లైక్ చేసినప్పుడు బటన్ చుట్టూ మెరుపులు కనిపిస్తాయి. ఇలాంటి మరికొన్ని యానిమేటెడ్ ఫీచర్లు కూడా యాడ్ అయ్యాయి.
ఇకపోతే యూట్యూబ్‌లో సాంగ్స్ సెర్చ్ చేసేందుకు ఏఐ సాంగ్ సెర్చ్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో ఉంది యుట్యూ్బ్. బయట ప్లే అవుతున్న సాంగ్‌ను లేదా నోటితో సాంగ్‌ను హమ్ చేస్తూ.. కావాల్సిన పాటను వెతకొచ్చు. పాట పేరు, లిరిక్స్, ఆర్టిస్ట్ వంటి వివరాలు తెలియకపోయినా నోటితో హమ్ చేస్తే ఏఐ సాయంతో సెర్చ్ చేసి దగ్గరగా ఉన్న రిజల్ట్ చూపిస్తుంది. సాంగ్ సెర్చ్ అనే ఫీచర్ ప్రస్తుతం గూగుల్ యాప్‌లో ఉంది. త్వరలోనే యూట్యూబ్‌లో కూడా అందుబాటులోకి రానుంది.
యూట్యూబ్ మొబైల్ యాప్‌లో న్యూస్ స్టోరీ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది యూట్యూబ్. గూగుల్ న్యూస్ ఫీడ్ లాగానే యూట్యూబ్‌లో కూడా న్యూస్ చూసేందుకు సెపరేట్ ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా అన్నిరకాల వార్తలను షార్ట్ వీడియోల రూపంలో చూడొచ్చు.