యూట్యూబ్‌లో కొత్త ఫీచర్లు!

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో స్లీప్ టైమర్, డ్రీమ్ స్క్రీన్, ఏఐ బాట్ వంటి మూడు లేటెస్ట్ ఫీచర్లు వచ్చాయి.

Advertisement
Update:2024-08-14 13:56 IST

మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా యాప్స్ కూడా కొత్త కొత్త అప్‌డేట్స్ తీసుకొస్తుంటాయి. ఇందులో భాగంగానే యూట్యూబ్ తమ యూజర్ల కోసం కొన్ని కొత్త ఫీచర్లను అనౌన్స్ చేసింది. అవేంటంటే..

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో స్లీప్ టైమర్, డ్రీమ్ స్క్రీన్, ఏఐ బాట్ వంటి మూడు లేటెస్ట్ ఫీచర్లు వచ్చాయి. ఇవెలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

స్లీప్ టైమర్

యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్‌ల వంటివి వినేవాళ్లకు లేదా వీడియో చూస్తూ నిద్రపోయే వాళ్లకోసం యూట్యూబ్ స్లీప్ టైమర్ అనే ఫీచర్‌‌ను తీసుకొచ్చింది. యూజర్లు స్లీప్ టైమర్‌‌ను సెట్ చేసుకోవడం ద్వారా ఆ సమయం అయిపోయిన తర్వాత వీడియో పాజ్ అయిపోతుంది. యూట్యూబ్‌లో వీడియోలు వింటూ లేదా చూస్తూ నిద్రపోయే వారికి ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.

డ్రీమ్ స్క్రీన్ ఫీచర్

డ్రీమ్ స్క్రీన్ అనే ఫీచర్ యూట్యూబ్ క్రియేటర్ల కోసం డిజైన్ చేసినది. యూట్యూబ్‌లో షార్ట్స్ చేసే వాళ్లు ఏఐ ద్వారా వెనుక గ్రీన్‌స్క్రీన్ బ్యాక్‌గ్రౌండ్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. తద్వారా ఎడిట్ చేసేటప్పుడు నచ్చిన వీడియోని బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లేస్ చేసుకోవచ్చు.

ఏఐ బాట్ ఫీచర్

యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా ఆ వీడియోకు సంబంధించి ఏవైనా డౌట్స్ వస్తే వెంటనే ఏఐ ద్వారా ఆ వివరాలు తెలుసుకునే విధంగా యూట్యూబ్ ఒక బాట్‌ను రూపొందించిది. వీడియో కింద ఆస్క్ ట్యాబ్ రూపంలో ఒక ట్యాబ్ కనిపిస్తుంది. అక్కడ ప్రశ్న టైప్ చేస్తే బాట్ దానికి ఆన్సర్ ఇస్తుంది.

యూట్యూబ్‌లో రానున్న ఈ ఫీచర్లన్నీ ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. త్వరలోనే ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.

Tags:    
Advertisement

Similar News