Xiaomi 14 Ultra | 50-ఎంపీ క్వాడ్ కెమెరాతో ప్రీమియం ఫోన్ షియోమీ 14 ఆల్ట్రా.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Xiaomi 14 Ultra | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ షియోమీ 14 ఆల్ట్రా (Xiaomi 14 Ultra) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. భారత్ మార్కెట్లో షియోమీ ఆవిష్కరించిన ఆల్ట్రా వేరియంట్ తొలి స్మార్ట్ ఫోన్ ఇది.
Xiaomi 14 Ultra | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన ప్రీమియం స్మార్ట్ ఫోన్ షియోమీ 14 ఆల్ట్రా (Xiaomi 14 Ultra) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. భారత్ మార్కెట్లో షియోమీ ఆవిష్కరించిన ఆల్ట్రా వేరియంట్ తొలి స్మార్ట్ ఫోన్ ఇది. గత నెలలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2024లో గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ ఆవిష్కరించింది. షియోమీ 14 ఆల్ట్రా 5జీ (Xiaomi 14 Ultra)తోపాటు షియోమీ 14 (Xiaomi 14) కూడా జత కలుస్తుంది. ఇతర ఫోన్ల మాదిరిగానే ఇందులోనూ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ (Qualcomm's Snapdragon 8 Gen 3 SoC) ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తున్నది.
షియోమీ 14 ఆల్ట్రా (Xiaomi 14 Ultra) ఫోన్ 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.99,999లకు లభిస్తుంది. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ కొన్న వారికి మూడు నెలల పాటు యూ-ట్యూబ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ఫోన్‌మీద షియోమీ రిజర్వ్ ఎడిషన్ ఆఫర్ కూడా అందిస్తోంది. ముందస్తుగా రూ.9,999 చెల్లించి రిజర్వ్ చేసుకున్న కస్టమర్లకు వచ్చేనెల ఎనిమిదో తేదీన ఫోన్ డెలివరీ అవుతుంది. ఈ నెల 11 నుంచి షియోమీ 14 ఆల్ట్రా ఫోన్ల ప్రీ-రిజర్వు ఆప్షన్ మొదలవుతుంది.
షియోమీ అఫిషియల్ వెబ్‌సైట్, షియోమీ హోమ్ ఔట్‌లెట్లలో ఏప్రిల్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి షియోమీ 14 ఆల్ట్రా ఫోన్ల విక్రయాలు ప్రారంభం అవుతాయి. ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. సెలెక్టెడ్ డివైజ్‌లు కొనుగోలు చేస్తే అదనంగా రూ.5,000 ఎక్స్చేంజ్ బోనస్ అందుకోవచ్చు.
షియోమీ 14 ఆల్ట్రా (Xiaomi 14 Ultra) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తోపాటు 3,200 x 1,440 రిజొల్యూషన్‌తో 6.73-అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్ మైక్రో కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉంటుంది. 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటది. ఒక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తున్నది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. సర్క్యులర్ మాడ్యూల్‌తో క్వాడ్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నదీ షియోమీ 14 ఆల్ట్రా.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తోపాటు షియోమీ 14 ఆల్ట్రా ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్‌వైటీ 900 ప్రైమరీ సెన్సర్ కెమెరా ఉంటుంది. వీటితోపాటు 3.2x జూమ్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్858 సెన్సర్ కెమెరా, 5x ఆప్టికల్ జూమ్ 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 858 సెన్సర్ కెమెరా, ఆల్ట్రావైడ్ లెన్స్ 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. వీటితోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా కూడా ఉంటుంది.
షియోమీ 14 ఆల్ట్రా ఫోన్ 90వాట్ల వైర్డ్, 80 వాట్ల వైర్‌లెస్, 10వాట్ల వైర్‌లెస్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదూ, నావ్ ఐసీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. చార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ కనెక్టివిటీ జత చేస్తారు.