పేలిపోయిన స్టార్‌షిప్‌ మెగా రాకెట్‌

ఫ్లోరిడా, బహమాస్‌ ప్రాంతాల్లోని ఆకాశంలో తారాజువ్వల్లా కనిపించిన ఈ శకలాలు;

Advertisement
Update:2025-03-07 12:11 IST

అంతరిక్షరంగంపై క్రమంగా పట్టు సాధిస్తున్న ఎలాన్‌ మస్క్‌ కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగించిన స్టార్‌షిప్‌ మెగా రాకెట్‌ విఫలమైంది. ఇది ఆ సంస్థకు పెద్ద కుదుపు. టెక్సాస్‌లోని బొకాచికా వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ఓ రాకెట్‌ను ప్రయోగించారు. అయితే ఆ రాకెట్‌ మొదట విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా అంతరిక్షంలో అది పేలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

రాకెట్‌ పేలిపోవడంపై స్సేస్‌ఎక్స్‌ స్పందించింది. ఇటీవల నిర్వహించిన ప్రయోగం కూడా ఇలాగే జరిగినట్లు తెలిపింది. వీటి నుంచి పాఠాలు నేర్చుకుంటామని వెల్లడించింది. ఇక రాకెట్‌ పేలిపోవడంతో దాని నుంచి భారీగా శకలాలు కిందికి దూసుకొచ్చాయి. ఫ్లోరిడా, బహమాస్‌ ప్రాంతాల్లోని ఆకాశంలో ఈ శకలాలు తారాజువ్వల్లా కనిపించాయి. ఈ క్రమంలోనే ఎయిర్‌ ట్రాఫిక్ కు కూడా ఆటంకం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. జనవరిలోనూ స్పేస్‌ ఎక్స్‌ నిర్వహించిన పునర్వినియోగ భారీ రాకెట్‌ స్టార్‌షిప్‌ విఫలమైంది. టెక్నికల్‌ రీజన్స్ వల్లే రాకెట్‌ పేలిపోయినట్లు ఆ సంస్థ పేర్కొన్నది. ఆ రాకెట్‌కు సంబంధించిన శకలాలు కరేబియన్‌ సముద్రంలో పడ్డాయి. అయితే బూస్టర్‌ క్షేమంగా లాంచ్‌ ప్యాడ్‌పైకి చేరింది. 

Tags:    
Advertisement

Similar News