ఇంటి నుంచి పని చేస్తున్నారా? వీడియో ఫాటిగ్ గురించి తెలుసుకోండి!
ప్రస్తుతం చాలామంది హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పని చేస్తున్నారు. అంటే ఆఫీసులో కొన్ని రోజులు ఇంటి నుంచి కొన్ని రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం చాలామంది హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో పని చేస్తున్నారు. అంటే ఆఫీసులో కొన్ని రోజులు ఇంటి నుంచి కొన్ని రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వర్చువల్ మీటింగ్‌లు, కాన్ఫరెన్స్‌లు వర్క్ లైఫ్‌లో భాగమైపోయాయి. ఇలాంటి వర్చువల్ మీటింగ్స్, వీడియో కాలింగ్స్ వల్ల చాలామందికి అలసట, నిస్సత్తువ పెరుగుతున్నాయట. దీన్నే ‘వీడియో ఫాటిగ్’ అంటున్నారు నిపుణులు. దీన్నుంచి ఎలా బయటపడాలంటే..
రోజంతా మొబైల్స్, ల్యాప్‌టాప్స్‌తో పనిచేసేవాళ్లు గ్యాడ్జెట్స్‌తోనే ఎక్కువ టైం గడపడం వల్ల తరచూ అలిసిపోవడం.. ఏ పని చేయకపోయినా నీరసించిపోవడం, తల తిరగడం, కళ్ల మంటలు లాంటి లక్షణాలు పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. వీడియో ఫాటిగ్ నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వీడియో కాల్స్ మాట్లాడేప్పుడు కళ్లు, చెవులు, మెదడు మరింత చురుకుగా పని చేస్తాయి. మెదడు ఎక్కువ ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. అలా తెలియకుండానే మెదడు ఒత్తిడికి గురవుతుందని నార్తర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ కౌన్సెలర్లు చెప్తున్నారు. రియల్ లైఫ్ డిస్కషన్స్ కంటే వర్చువల్ డిస్కషన్స్‌లో మెదడు మరింత ఒత్తిడికి లోనవుతుందట. ఇతరులతో కమ్యూనికేట్ చేసేటప్పుడు 85 శాతం కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్ ద్వారానే జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్స్‌ల్లో అలా కుదరదు కాబట్టి.. మెదడు ఎక్కువ ఫోకస్డ్‌గా పని చేయాల్సివస్తుంది. అందుకే వర్చువల్ టైం ఎక్కువైతే మెదడుపై ఎక్కువ ఒత్తిడి పడి, వెంటనే అలసి పోయినట్టు అనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు.
సొల్యూషన్ ఇదే..
వర్చువల్ మీటింగ్స్ ఎఫెక్ట్.. మీపై పడకుండా ఉండాలంటే.. రూమ్‌లో లైటింగ్ బ్రైట్‌గా ఉండేలా చూసుకోవాలి. రూం లైటింగ్ ఎంత డార్క్‌గా ఉంటే ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకూ మీటింగ్స్‌ను అవుట్‌డోర్‌లో లేదా సన్‌లైట్ బాగా పడే చోట ఏర్పాటు చేసుకుంటే మంచిది. అలసటగా ఫీలవుతున్న వాళ్లు వర్చువల్ మీటింగ్స్ మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అవసరమనుకున్న మీటింగ్స్ మాత్రమే అటెండ్ చేస్తూ.. కొన్ని మీటింగ్స్‌ను ఇ–మెయిల్స్ లేదా టెక్స్ట్ ఇంటరాక్షన్‌తో మేనేజ్ చేయగలరేమో చూసుకోవాలి.
వీడియో కాల్స్ చేసేటప్పుడు కెమెరాకు కనీసం ఒక మీటర్ దూరంలో ఉంటే మంచిది. వీడియో కాల్స్ కోసం ల్యాప్‌టాప్‌కి బదులు ఫోన్ వాడడం కాస్త బెటర్.
మీటింగ్స్ మధ్యలో కొంత గ్యాప్ ఇస్తూ.. నీళ్లు తాగడం, అటు ఇటు నడవడం లాంటివి చేయాలి.
రోజులో ఎక్కువసేపు వర్చువల్‌గా గడిపాల్సి వచ్చినప్పుడు మిగతా సమయంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు దూరంగా ఉండాలి.
వీటితోపాటు నీళ్లు ఎక్కువగా తాగడం, పండ్లు ఎక్కువగా తినడం, రోజువారీ వ్యాయామాలు చేస్తుండడం వల్ల మెదడు రిలాక్స్ అవుతుంది.