ఈ ఏడాది ఇంటర్నెట్‌లో ఎక్కువగా చదివినవి ఇవే..

ఈ ఏడాది వికీపీడియాకు 84 వేల కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే దీని పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు.

Advertisement
Update:2023-12-09 14:15 IST

ఇంటర్నెట్‌లో దేని గురించైనా డీటెయిల్డ్‌గా తెలుసుకునేందుకు వికీపీడియా మంచి సొర్స్‌గా ఉంటూ వస్తోంది. ఈ ఏడాది వికీపీడియాకు 84 వేల కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే దీని పాపులారిటీని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాది వికీపీడియాలో వేటి గురించి ఎక్కువగా చదివారో ఇప్పుడు తెలుసుకుందాం.

వికీపీడియాలో ఈ ఏడాది ఎక్కువమంది చదివిన ఆర్టికల్స్.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి. ముఖ్యంగా ‘ఛాట్‌జీపీటీ’ వికీ పేజీని అత్యధికంగా 4.94 కోట్ల మంది చదివారని వికీపీడియా రిపోర్ట్‌లు చెప్తున్నాయి. చాట్‌జీపీటీ టెక్నాలజీ గురించి, దాని హిస్టరీ గురించి అర్థం చేసుకోవడానికి ఈ ఏడాది ఎక్కువమంది ప్రయత్నించారని వికీపీడియా రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

ఇక రెండో స్థానంలో ఈ ఏడాది నమోదైన మరణాల గురించి ఎక్కువగా చదివారు. వికీపీడియాలో క్రియేట్ చేసిన ‘డెత్స్ ఇన్ 2023’ అనే పేజీని సుమారు 42 కోట్లమంది చదివారు. దీని తర్వాత మూడు, నాలుగు స్థానాల్లో క్రికెట్ ఉంది. 2023 క్రికెట్ వరల్డ్ కప్ గురించి సుమారు 38 కోట్ల మంది, ఐపీయల్ క్రికెట్ గురించి 32 కోట్ల మంది చదివారు. ఇక ఐదో స్థానంలో ‘ఓపెన్‌హైమర్’ అనే హాలీవుడ్ సినిమా ఉండడం విశేషం. ఫాదర్ ఆఫ్ ఆటమ్ బాంబ్ అయిన ఓపెన్‌హైమర్.. మీద తీసిన ఈ సినిమా ఈ ఏడాది మోస్ట్ పాపులర్ ఫిల్మ్స్‌లో ఒకటి. ఈ సినిమా వికీపీడియా పేజీని సుమారు 32 కోట్ల మంది చదివారు.

అమెరికా, ఇంగ్లండ్ తర్వాత వికీపీడియాను ఎక్కువగా వాడుతుంది ఇండియన్సేనట. ఇండియాలో వికీపీడియాకు 4,700 మంది వాలంటీర్‌ ఎడిటర్స్‌ ఉన్నారట. ఈ ఏడాది ఎక్కువగా చదివిన విషయాల్లో ఓపెన్‌హైమర్ తర్వాత జవాన్, పఠాన్ సినిమాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇక వీటితోపాటు టేలర్ స్విఫ్ట్(పాప్ సింగర్), బార్బీ సినిమా, క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ, ఎలన్ మస్క్, అవతార్ మూవీ, రష్యా ఉక్రెయిన్ వార్ వంటి విషయాలను కూడా ఈ ఏడాది ఎక్కువమంది చదివారు.

Tags:    
Advertisement

Similar News