మీ ఏరియాలో ఎప్పుడు వర్షం వస్తుంది? సింపుల్‌గా ఇలా తెలుసుకోవచ్చు!

ఈరోజు వర్షం కురుస్తుందా? లేదా? రేపు వాతావరణం ఎలా ఉండబోతోంది? లాంటి అన్న వివరాలు తెలుసుకుంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.

Advertisement
Update:2023-07-20 18:27 IST

మీ ఏరియాలో ఎప్పుడు వర్షం వస్తుంది? సింపుల్‌గా ఇలా తెలుసుకోవచ్చు!

దేశంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏయే రోజుల్లో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయో కూడా వాతావరణ శాఖ ముందుగానే చెప్తోంది. అయితే ఇలాంటి వెదర్ రిపోర్ట్స్‌ను సింపుల్‌గా మన ఫోన్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదెలాగంటే..

వర్షాలు కురుస్తున్నప్పటికీ పనులమీద బయటకు వెళ్లకుండా ఉండలేము. తప్పనిపరిస్థితుల్లో బయట అడుగుపెట్టక తప్పదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు వర్షం కురుస్తుందా? లేదా? రేపు వాతావరణం ఎలా ఉండబోతోంది? లాంటి అన్న వివరాలు తెలుసుకుంటే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.

వెదర్ అలర్ట్స్‌ కోసం ఆండ్రాయిడ్ యూజర్లు.. గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్లి అందులో ‘క్రైసిస్ రిలేటెడ్ అలర్ట్స్’ అనే ఫీచర్‌‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఈ ఫీచర్ సాయంతో మీ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల వంటివి వచ్చే అవకాశం ఉంటే.. యాప్ ముందుగానే అలర్ట్ ఇస్తుంది. తుఫాన్ల వంటి రెడ్ అలర్ట్స్‌ను తెలియజేస్తుంది. దీంతోపాటు ప్లే స్టోర్‌‌లో ‘యాక్యురేట్ వెదర్ ఫోర్ కాస్ట్ అండ్ వెదర్ రేడార్ మ్యాప్’ అనే వెదర్ యాప్ సాయంతో ఎప్పటికప్పుడు రియల్ టైం వెదర్ రిపోర్ట్స్ తెలుసుకోవచ్చు.

ఇక ఐఫోన్‌ యూజర్లు అయితే ఫోన్‌లోనే బిల్ట్‌ఇన్ వెదర్ యాప్ ఉంటుంది. ఆ యాప్ ఓపెన్ చేసి కింద రైట్ కార్నర్‌లో లిస్ట్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ అడిషనల్ ఆప్షన్స్‌లోకి వెళ్లి నోటిఫికేషన్స్‌పై క్లిక్ చేస్తే.. అక్కడ సివియర్ వెదర్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్ చేస్తే.. తుఫాన్లు, వరదల్లాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు సంబంధించి నోటిఫికేషన్స్ పొందొచ్చు.

Tags:    
Advertisement

Similar News