వాట్సాప్‌లో త్వరలో రాబోతున్న ఫీచర్లివే..

వాట్సాప్ స్టేటస్ లేదా మెసేజ్‌ల్లో ఫొటోలు, వీడియోలు పంపేటప్పుడు యూజర్లు వాటిపై టెక్స్ట్‌ జత చేయడం, టెక్స్ట్ అలైన్‌మెంట్‌ లాంటివి చేసే విధంగా డ్రాయింగ్‌ టూల్‌, టెక్స్ట్‌ ఎడిటర్‌ లాంటి ఫీచర్లపై పనిచేస్తోంది వాట్సాప్.

Advertisement
Update:2023-02-02 20:02 IST

వాట్సాప్‌లో త్వరలో రాబోతున్న ఫీచర్లివే..

యూజర్లకు బెటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడం కోసం వాట్సాప్‌ ఎప్పటికప్పుడు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. ఇప్పటికే వాయిస్‌ నోట్‌, సెర్చ్‌ విత్ డేట్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది. అయితే తాజాగా మరికొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

వాట్సాప్ స్టేటస్ లేదా మెసేజ్‌ల్లో ఫొటోలు, వీడియోలు పంపేటప్పుడు యూజర్లు వాటిపై టెక్స్ట్‌ జత చేయడం, టెక్స్ట్ అలైన్‌మెంట్‌ లాంటివి చేసే విధంగా డ్రాయింగ్‌ టూల్‌, టెక్స్ట్‌ ఎడిటర్‌ లాంటి ఫీచర్లపై పనిచేస్తోంది వాట్సాప్. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

అలాగే యూజర్ ఇంటర్‌ఫేస్, సెక్యూరిటీని మెరుగుపరచేందుకు కొత్త అప్‌డేట్‌లు, మరిన్ని ఫీచర్లపై కూడా పని చేస్తోంది. క్యాలెండర్ ద్వారా సెర్చ్ చేయడం, స్టేటస్‌పై వాయిస్ నోట్స్, ఐఓఎస్ యూజర్ల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ లాంటి కొత్త ఫీచర్లను కూడా తీసుకురానుంది.

వీటితోపాటు వాట్సాప్ యూజర్లు కీబోర్డ్ పైన రకరకాల ఫాంట్‌లు మార్చుకునేలా మరో కొత్త ఫీచర్‌‌పై కూడా పనిచేస్తోంది. అలాగే వాట్సాప్‌ ద్వారా ఒరిజినల్ క్వాలిటీలో ఫొటోలు పంపుకునే ఫీచర్‌‌ కూడా తీసుకొస్తున్నట్టు వాట్సాప్ చెప్తోంది. వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్ (23.1.75) తో వీటిలో కొన్ని ఫీఛర్లు అందుబాటులోకి రానున్నాయి.

Tags:    
Advertisement

Similar News