ఏఐ ఇమేజ్ ఎడిటర్, వన్ మినిట్ స్టేటస్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!

వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం యూజర్లు వాట్సాప్‌లోనే ఇమేజ్‌లను ఎడిట్ చేసుకునేవిధంగా ఓ కొత్త ఏఐ టూల్ అలాగే వాట్సాప్‌లో ఏఐ సెర్చ్ బార్ వంటి ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Update:2024-03-27 06:00 IST

వాట్సాప్‌లో రకరకాల కొత్త ఫీచర్లను పరిచయడంపై తెగ కసరత్తు చేస్తోంది మెటా సంస్థ. వాట్సాప్‌లో ఏఐ టూల్స్‌ను ఇంటిగ్రేట్ చేస్తూ పలురకాల ఫీచర్లను తీసుకురాబోతోంది. ఇవెలా ఉంటాయంటే..

వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం యూజర్లు వాట్సాప్‌లోనే ఇమేజ్‌లను ఎడిట్ చేసుకునేవిధంగా ఓ కొత్త ఏఐ టూల్ అలాగే వాట్సాప్‌లో ఏఐ సెర్చ్ బార్ వంటి ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. ఈ టూల్స్ సాయంతో యూజర్లు వాట్సాప్ ద్వారానే రకరకాల పనులు సులభంగా చేసుకునే వీలుంటుంది.

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ టూల్ రాబోతోంది. ఈ కొత్త ఏఐ టూల్ సాయంతో యూజర్లు తమ ఫొటోలను వాట్సాప్‌లోనే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. తాము పంపాలనుకున్న ఇమేజ్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ని మార్చడం లేదా ఏఐ టెక్నాలజీ ద్వారా కొత్తకొత్త ఇమేజ్‌లను క్రియేట్ చేయడం వంటి పనులు వాట్సాప్‌లోనే చేసుకోవచ్చు. ఇక దీంతోపాటు వాట్సాప్‌లో ఏఐ రిలేటెడ్ సెర్చ్ బార్‌‌ను కూడా ప్రవేశపెట్టే ప్లానింగ్‌లో ఉంది మెటా సంస్థ. యూజర్లు ఈ సెర్చ్ బార్ ద్వారా తమ ప్రశ్నలను అడిగి తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్లన్నీ టెస్టింగ్ దశలో ఉన్నాయి. ఇవి అందుబాటులోకి రావడానికి సమయం పట్టొచ్చు. ఇవి ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై పనిచేస్తాయి.

వాట్సాప్‌లో స్టేటస్ డ్యూరేషన్ లిమిట్‌ను కూడా పెంచే యోచనలో ఉంది మెటా సంస్థ . ప్రస్తుతానికి యూజర్లు గరిష్ఠంగా 30 సెకన్ల వీడియోను మాత్రమే స్టేటస్‌లో పోస్ట్​ చేసే వీలుంది. పెద్ద వీడియోలు పెట్టేకొద్దీ స్టేటస్‌ల సంఖ్య పెరుగుతూ పోతుంది. అందుకే రానున్న రోజుల్లో లిమిట్ పెంచుతూ 60 సెకన్ల వీడియోలను పెట్టుకోగలిగేలా అప్‌డేట్ రానుంది.

ఇకపోతే వాట్సప్‌ చాట్‌లో ఒక మెసేజ్ మాత్రమే పిన్ చేసుకునే అవకాశం ఉండేది. రీసెంట్‌గా 3 మెసేజ్‌లను పిన్ చేసుకునేలా అప్‌డేట్ వచ్చింది. అలాగే యూజర్లు చాట్‌లలో లింక్‌లు పంపేటప్పుడు వాటి ప్రివ్యూలను బ్లాక్ చేసే మరో ఫీచర్‌‌పై వాట్సాప్ పనిచేస్తోంది.

Tags:    
Advertisement

Similar News