వాట్సాప్‌లో స్కామ్‌లకు చిక్కకుండా
WhatsApp Scams: వాట్సాప్‌లో (WhatsApp) వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్‌ల మోసంలో పడి ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఏకంగా రూ.42 లక్షలు పోగొట్టుకున్నాడు.
వాట్సాప్‌లో వచ్చే స్పామ్ కాల్స్, మెసేజ్‌ల మోసంలో పడి ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఏకంగా రూ.42 లక్షలు పోగొట్టుకున్నాడు. అసలు వాట్సాప్‌లో ఇలాంటి స్కామ్స్ ఎలా జరుగుతాయి? సేఫ్ గా ఉండడం ఎలా?
సైబర్ నేరగాళ్లు వాట్సప్ ద్వారా మెసేజ్‌లు, కాల్స్ చేసి పార్ట్-టైమ్ ఉద్యోగం ఇస్తామని, లోన్ ఇస్తామని ఆశ పెడుతుంటారు. దానికోసం కొన్ని గ్రూపుల్లో యాడ్ అవ్వాలని, లింక్ ద్వారా రీడైరెక్ట్ అవ్వాలని చెప్తుంటారు. అలా మాయలో పడి వాళ్లు చెప్పింది చేస్తే.. అకౌంట్‌లో డబ్బు ఖాళీ అవ్వడం ఖాయం.
వాట్సాప్‌లో ఇలాంటి స్కామ్స్‌కు దొరక్కుండా ఉండాలంటే.. వాట్సాప్‌కు ‘టూ ఫ్యాక్టర్’ అథెంటికేషన్ పెట్టుకోవాలి.
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగినా, గ్రూపుల్లో చేరమని అడిగినా అనుమానించాలి.
సైబర్ నేరగాళ్లు పెద్ద సంస్థల పేరుతో మోసాలు చేస్తుంటారు. అందుకే ఉద్యోగం, లోన్ పేరుతో కాల్స్ వచ్చినప్పుడు ఆయా సంస్థలకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి.
గుర్తు తెలియని నెంబర్ నుంచి వచ్చిన కాల్స్, మెసేజ్ లకు రిప్లై ఇవ్వకూడదు. అలాంటి అకౌంట్స్ గురించి వాట్సాప్ కు రిపోర్ట్ చేయాలి.
తెలియని వాట్సాప్ గ్రూప్స్‌లో ఉండొద్దు. గ్రూప్ చాట్స్‌లో లింక్స్, యాడ్స్ లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటే ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడం బెటర్.
ఇకపోతే వాట్సాప్‌లో ప్రొఫైల్ ఫొటో, ఆన్‌లైన్ స్టేటస్ వంటివి ఎవరెవరు చూడొచ్చనేది ప్రైవసీ సెట్టింగ్స్ ద్వారా మార్చుకోవాలి. తెలిసిన వారితో మాత్రమే పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాలి.
అనుమానిత మెసేజ్‌లు, కాల్స్ వచ్చినప్పుడు వీలైనంత వరకూ అవాయిడ్ చేయడం మంచిది. పొరపాటున సైబర్ మోసంలో చిక్కితే వెంటనే సైబర్ పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వాలి.