ట్రాన్స్‌క్రిప్షన్, ఫేవరెట్స్ ట్యాబ్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!

వాట్సాప్‌లో చాలామంది వాయిస్‌ మెసేజ్‌లు పంపుకుంటుంటారు. టైప్ చేయడం రాని వాళ్లు వాయిస్ రికార్డ్ చేసి పంపుతుంటారు.

Advertisement
Update:2024-07-19 06:00 IST

ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంద. రీసెంట్‌గా ‘ట్రాన్స్‌క్రిప్షన్’, ‘ఫేవరెట్స్’ అనే రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇవెలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సాప్‌లో చాలామంది వాయిస్‌ మెసేజ్‌లు పంపుకుంటుంటారు. టైప్ చేయడం రాని వాళ్లు వాయిస్ రికార్డ్ చేసి పంపుతుంటారు. అయితే అవతలి వాళ్లు అన్ని సందర్భాల్లో ఆ వాయిస్‌లను వినలేకపోవచ్చు. ప్రయాణాల సమయంలో లేదా అందరి ముందు వినకూడదు అనుకున్నప్పుడు వాయిస్ మెసేజ్‌లను వినే వీలుండదు. అలాంటప్పుడు ఆ వాయిస్‌లను టెక్స్ట్‌ రూపంలో చదివగలిగేలా వాట్సాప్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌‌ను తీసుకొచ్చింది.

వాట్సాప్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ ద్వారా వాయిస్​ మెసేజ్‌లు ఆటోమేటిక్​గా టెక్ట్స్​ రూపంలోకి కన్వర్ట్ అవుతాయి. వాయిస్​ మెసేజ్​ను వినాల్సిన అవసరం లేకుండా నేరుగా చదివేయొచ్చు. వాయిస్ ఏ భాషలో ఉంటే మెసేజ్​ కూడా అదే భాషలో కనిపిస్తుంది. ఇంగ్లీష్‌, హిందీ సహా పలు భాషలను ఈ ఫీఛర్ సపోర్ట్‌ చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

వాట్సాప్ ‘ఫేవరెట్స్’ పేరుతో మరో ఫీచర్ తీసుకొచ్చింది. వాట్సాప్‌లో చాట్ లేదా కాల్ చేసేందుకు ప్రతిసారీ పేరు వెతుక్కోకుండా ఫేవరెట్స్ అనే ట్యాబ్ ఉపయోగపడుతుంది. రోజూ చాట్ చేసే కాంటాక్ట్స్‌ను ఫేవరెట్స్ ట్యాబ్‌లోకి యాడ్ చేస్తే ఒక్క క్లిక్ తో వారికి కాల్స్ లేదా మెసేజ్ చేయొచ్చు.

వాట్సాప్‌ యాప్‌లో కాల్స్‌ బటన్​పై క్లిక్‌ చేసి ‘యాడ్ టు ఫేవరెట్స్’ అనే ఆప్షన్​ను ఎంచుకుంటే సెలక్ట్ చేసుకున్న కాంటాక్ట్‌ నెంబర్లు ఫేవరెట్స్​లో యాడ్‌ అవుతాయి. లేదా సెట్టింగ్స్‌లోకి వెళ్లినా ఫేవరెట్స్‌ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

Tags:    
Advertisement

Similar News