పుష్ నేమ్స్, ఇన్‌బిల్ట్ స్టికర్స్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు..

వాట్సాప్ యూజర్ల కోసం కొత్తగా కొన్ని ఫీచర్లు తీసుకురాబోతోంది. గ్యాలరీలోని ఇమేజ్‌లను స్టికర్స్‌గా మార్చే ఫీచర్‌‌తో పాటు ఐఓఎస్ యూజర్ల కోసం పుష్ నేమ్స్ అనే ఫీచర్‌‌ను తీసుకొస్తోంది.

Advertisement
Update:2023-03-10 15:14 IST

యూజర్ల కోసం వాట్సాప్ కొత్తగా కొన్ని ఫీచర్లు తీసుకురాబోతోంది. గ్యాలరీలోని ఇమేజ్‌లను స్టికర్స్‌గా మార్చే ఫీచర్‌‌తో పాటు ఐఓఎస్ యూజర్ల కోసం పుష్ నేమ్స్ అనే ఫీచర్‌‌ను తీసుకొస్తోంది. ఇవెలా ఉంటాయంటే..

మామూలుగా గ్యాలరీలో ఉండే ఫోటోలను వాట్సాప్ స్టికర్స్‌గా మార్చాలంటే.. థర్డ్ పార్టీ అప్లికేషన్‌లను వాడాల్సి ఉంటుంది. అయితే వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్ సాయంతో ఎలాంటి థర్డ్-పార్టీ అప్లికేషన్‌ల అవసరం లేకుండా ఇన్‌బిల్ట్‌గానే స్టికర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం ఇది మొదటగా ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్ యూజర్లకు అప్‌డేట్ రూపంలో వస్తుంది. ఈ ఫీచర్ సాయంతో ఇన్‌స్టంట్‌గా స్టిక్కర్‌లు క్రియేట్ చేసుకోవచ్చని వాట్సాప్‌ అంటోంది.

ఇక మరో ఫీచర్ విషయానికొస్తే.. సాధారణంగా వాట్సాప్ గ్రూప్స్‌లో చాట్ సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ తప్ప మిగతా పార్టిసిపెంట్ల పేర్లు బయటకు కనిపించవు. ఇలా తెలియని నంబర్ నుంచి గ్రూప్ చాట్‌లో ఏదైనా మెసేజ్ వస్తే వారెవరనేది తెలుసుకునేందుకు కొత్తగా ‘పుష్ నేమ్స్’ అనే ఫీచర్ తీసుకొస్తోంది వాట్సాప్. ఈ ఫీచర్ ద్వారా తెలియని గ్రూప్ పార్టిసిపెంట్స్‌ను గుర్తించడం ఈజీ అవుతుంది.

వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం కొత్త ఫీచర్‌‌తో యూజర్లకు తెలియని గ్రూప్ మెంబర్ నుంచి మెసేజ్ వచ్చిన ప్రతిసారీ ఫోన్ నంబర్‌కు బదులుగా పుష్ పేర్లు చాట్ లిస్ట్‌లో కనిపిస్తాయి. ఈ కొత్త ఫీచర్ పెద్ద గ్రూప్ చాట్‌లలో చాలా హెల్ప్ అవుతుందని వాట్సాప్ అంటోంది.

Tags:    
Advertisement

Similar News