వీడియో కాల్.. గ్రూప్ పోల్... వాట్సాప్‌లో నాలుగు కొత్త ఫీచర్లు!

ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ యూజర్లకు బెటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తోంది వాట్సాప్. తాజాగా గ్రూప్, కమ్యూనిటీలకు సంబంధించి వాట్సాప్ నాలుగు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది.

Advertisement
Update:2022-11-07 13:42 IST

ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ యూజర్లకు బెటర్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తోంది వాట్సాప్. తాజాగా గ్రూప్, కమ్యూనిటీలకు సంబంధించి వాట్సాప్ నాలుగు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అవేంటంటే..

వాట్సాప్‌లో గ్రూప్స్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పడు వాట్సాప్ గ్రూపులను లింక్ చేసేలా కమ్యూనిటీస్‌ను తీసుకొచ్చింది. కమ్యూనిటీస్ ద్వారా వేర్వేరు గ్రూప్‌లు లింక్ చేయొచ్చు. అంటే గ్రూప్‌లో మెంబర్స్ ఉన్నట్టుగా కమ్యూనిటీలో గ్రూపులుంటాయన్న మాట. గ్రూప్‌లకు అడ్మిన్‌ ఉన్నట్లుగానే.. కమ్యూనిటీస్‌ కూడా అడ్మిన్‌ ఉంటారు. ఉదాహరణకు ఒక కాలేజీలో తరగతుల వారీగా వాట్సాప్‌ గ్రూప్‌లు క్రియేట్‌ చేసుకుంటారు. ఈ వాట్సాప్‌ గ్రూప్స్ అన్నింటినీ ఒకచోట లింక్ చేసేందుకు కమ్యూనిటీస్‌ ఉపయోగపడతాయి. గ్రూపులన్నింటినీ కమ్యూనిటీ ద్వారా ఒకే వేదికపైకి తీసుకురావచ్చు. ఒక గ్రూప్‌లో షేర్‌ చేసిన ఇన్ఫర్మేషన్ ఇతర గ్రూప్‌ మెంబర్స్ చూడాలా? వద్దా? అనేది కమ్యూనిటీ అడ్మిన్‌ నిర్ణయిస్తారు. ఒక గ్రూప్‌లోని సభ్యులు, మరో గ్రూప్‌లో చేరడం, ఒకేసారి అన్ని గ్రూప్‌లలో ఇన్ఫర్మేషన్ షేర్‌ చేయడం వంటి అధికారాలు అడ్మిన్‌ చేతిలో ఉంటాయి. చాట్ పేజీలో కమ్యూనిటీస్‌ పేరుతో ఫీచర్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి, కొత్త కమ్యూనిటీ క్రియేట్‌ చేసి అందులో గ్రూప్స్‌ను చేర్చొచ్చు.

వాట్సాప్‌ పోల్‌

అందరి అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకోడానికి పోల్స్ లాంటివి పనికొస్తాయి. అందుకే పోల్స్ ఫీచర్‌‌ను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది వాట్సాప్. గ్రూప్‌ సభ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు 'వాట్సాప్ ఇన్‌-చాట్ పోల్స్‌' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూప్‌ అడ్మిన్‌ పోల్‌ క్రియేట్ చేసి, మెంబర్స్‌తో షేర్‌ చేస్తే, వారు తమకు నచ్చిన ఆప్షన్‌ను సెలెక్ట్ చేయొచ్చు. ఫైల్‌ అటాచ్‌ ఐకాన్‌పై క్లిక్ చేస్తే పోల్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి పోల్‌ క్రియేట్ చేయొచ్చు.

వాట్సాప్‌ గ్రూప్‌ కాలింగ్

ప్రస్తుతం వాట్సాప్‌లో ఒకేసారి ఎనిమిది మంది వీడియో కాల్‌ మాట్లాడే అవకాశం ఉంది. తాజా అప్‌డేట్‌ ద్వారా ఈ సంఖ్యను 32 మందికి పెంచుతున్నట్లు ప్రకటించింది వాట్సాప్. అలాగే ఒక వాట్సాప్ గ్రూప్‌లో వెయ్యి కంటే ఎక్కువ మంది సభ్యులుగా ఉండేలా మార్పులు చేయనున్నట్లు కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌ ప్రకటించింది. తాజాగా గ్రూప్‌ సభ్యుల గరిష్ట సంఖ్యను 1024కు పెంచినట్లు తెలిపింది.

Tags:    
Advertisement

Similar News