వాట్సాప్‌లో కొత్త ఫీఛర్లు! ఒకే నంబర్‌తో రెండు ఫోన్లలో వాట్సాప్‌ !

ఈ ఫీచర్ ద్వారా ఒకే నంబర్‌తో రెండు ఫోన్లలో వాట్సాప్‌ ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకేసారి వేర్వేరు ఫోన్లలో ఒకే నెంబర్‌తో వాట్సాప్‌ సేవలనుు పొందొచ్చు.

Advertisement
Update:2022-11-17 08:30 IST

వాట్సాప్‌లో కొత్త ఫీఛర్లు! ఒకే నంబర్‌తో రెండు ఫోన్లలో వాట్సాప్‌ !

వాట్సాప్ లేటెస్ట్‌గా కొన్ని కొత్త అప్‌డేట్స్ తీసుకొచ్చింది. అందులో డీఎన్‌డీ. కంపానియన్ మోడ్ లాంటి ప్రత్యేకమైన ఫీచర్లున్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏదైనా ముఖ్యమైన పనిలోఉన్నప్పుడు నోటిఫికేషన్ల వల్ల పనికి భంగం కలగకుండా ఉండేందుకు వాట్సాప్.. 'డు నాట్ డిస్టర్బ్' మోడ్‌ను తీసుకొచ్చింది. డీఎన్‌డీ మోడ్‌ను ఎనేబుల్ చేస్తే ఎలాంటి మెసేజ్‌ లేదా కాల్స్‌ వచ్చినా యూజర్‌కు అవి కనిపించవు.

యాప్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఎవరు, ఎప్పుడు కాల్ చేశారనే వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం డీఎన్‌డీ మోడ్‌ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. దీంతోపాటు వాట్సాప్‌ 'కంపానియన్‌ మోడ్‌' పేరుతో మరో కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొస్తోంది.

ఈ ఫీచర్ ద్వారా ఒకే నంబర్‌తో రెండు ఫోన్లలో వాట్సాప్‌ ఉపయోగించుకోవచ్చు. యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లలో వాడుకోవచ్చు. అంటే ఒకేసారి వేర్వేరు ఫోన్లలో ఒకే నెంబర్‌తో వాట్సాప్‌ సేవలనుు పొందొచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌ గ్రూప్ మెంబర్స్ సంఖ్యను 256 నుంచి 1024కు పెంచిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. 256 మంది కంటే ఎక్కువమంది మెంబర్స్‌గా ఉన్న గ్రూప్ నోటిఫికేషన్లు ఆటోమేటిగ్గా మ్యూట్‌ అయ్యేలా గ్రూప్ ఫీచర్లలలో మార్పులు చేసింది. అలాగే వీటితోపాటు వాయిస్‌ స్టేటస్‌, డాక్యుమెంట్ క్యాప్షన్‌, షార్ట్‌కట్‌ కెమెరా వంటి కొత్త ఫీఛర్లను కూడా త్వరలోనే తీసుకురానున్నట్టు వాట్సాప్ ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News