అకౌంట్ రిస్ట్రిక్షన్, ఈవెంట్ ప్లానింగ్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!
వాట్సాప్‌లో వచ్చే స్పామ్ ఆటోమేటెడ్ మెసేజ్‌లు, బల్క్ ప్రమోషనల్ మెసేజ్‌లను రిస్ట్రిక్ట్ చేసేందుకు ‘అకౌంట్ రిస్ట్రిక్షన్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో ద్వారా తెలుస్తోంది.
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ యూజర్ల వెసులుబాటు కోసం రకరకాల కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతుంటుంది. అందులో భాగంగానే రీసెంట్‌గా రెండు కొత్త ఫీచర్లను అనౌన్స్ చేసింది. వాటి వివరాల్లోకి వెళ్తే..
వాట్సాప్‌లో వచ్చే స్పామ్ ఆటోమేటెడ్ మెసేజ్‌లు, బల్క్ ప్రమోషనల్ మెసేజ్‌లను రిస్ట్రిక్ట్ చేసేందుకు ‘అకౌంట్ రిస్ట్రిక్షన్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్టు వాట్సాప్ బీటా ఇన్ఫో ద్వారా తెలుస్తోంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు బల్క్‌గా ఒకేసారి అందరికీ మెసేజ్‌లను పంపడం కుదరదు.
వాట్సాప్‌లో ఆటోమేటెడ్ స్పామ్ మెసేజ్‌లను రిసీవ్ చేసుకున్నప్పుడు వెంటనే ఆ అకౌంట్‌ను రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా అవతలి యూజర్ కొంత సమయం పాటు ఎవరికీ మెసేజ్ పంపే వీలుండదు. వాట్సాప్‌లో స్పామ్ మెసేజ్ ల ఇబ్బందులను తగ్గించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వాట్సా్ప్ చేప్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. యాప్‌లో వచ్చే ఫ్యూచర్ అప్‌డేట్‌తో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
ఇకపోతే తాజాగా వాట్సాప్ ‘ఈవెంట్ ప్లానింగ్’ అనే మరో కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఈ ఫీచర్ వాట్సాప్ కమ్యూనిటీ యూజర్లకు యూజ్‌ఫుల్‌గా ఉండనుంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు వాట్సాప్ ద్వారానే ఈవెంట్లను ప్లాన్ చేసుకోవచ్చు. గ్రూప్‌లోని మెంబర్స్‌కు ఈవెంట్ ఇన్విటేషన్లు పంపుకోవచ్చు. గ్రూప్‌లోని మెంబర్స్ బర్త్ డే పార్టీలు, ఈవెంట్ మీటింగ్స్ వంటివి కూడా సెట్ చేసుకోవచ్చు. మిగతా యూజర్లు ఈవెంట్‌కు రిప్లై ఇవ్వొచ్చు. అలాగే ఈవెంట్ సమయానికి ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ పొందొచ్చు. ఈ ఫీచర్ త్వరలోనే వాట్సాప్ కమ్యూనిటీలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత వాట్సాప్ గ్రూపులకు కూడా విస్తరిస్తామని మెటా చెప్తోంది.