వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త ఫీచర్..
వాట్సాప్‌లో గ్రూప్స్ అనేవి చాలా పాపులర్. ప్రతి ఒక్కరూ రెండు, మూడు వాట్సాప్ గ్రూపుల్లో కచ్చితంగా జాయిన్ అయ్యి ఉంటారు. వాట్సాప్ గ్రూప్స్‌ను గ్రూప్ అడ్మిన్స్ లీడ్ చేస్తుంటారు. అందుకే గ్రూప్ అన్ని యాక్సిస్‌లు అడ్మిన్‌కు ఉండేలా ఓకొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తీసుకొస్తున్న వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను అనౌన్స్ చేసింది. వాట్సాప్ గ్రూపు అడ్మిన్‌లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ ఇది.
వాట్సాప్‌లో గ్రూప్స్ అనేవి చాలా పాపులర్. ప్రతి ఒక్కరూ రెండు, మూడు వాట్సాప్ గ్రూపుల్లో కచ్చితంగా జాయిన్ అయ్యి ఉంటారు. వాట్సాప్ గ్రూప్స్‌ను గ్రూప్ అడ్మిన్స్ లీడ్ చేస్తుంటారు. అందుకే గ్రూప్ అన్ని యాక్సిస్‌లు అడ్మిన్‌కు ఉండేలా ఓకొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులు ఏదైనా మెసేజ్ లేదా పోస్ట్ షేర్ చేస్తే దాన్ని డిలీట్ చేసే ఆప్షన్ కేవలం సదరు యూజర్‌కు మాత్రమే ఉండేది. తాజా అప్‌డేట్‌తో గ్రూపు అడ్మిన్‌లు కూడా మెసేజ్‌లను డిలీట్ చేయొచ్చు. ఫేక్ న్యూస్, అభ్యంతరమైన మెసేజ్‌లకు చెక్ పెట్టడానికి ఈ ఫీచర్ పనికొస్తుంది.
గ్రూప్ మెంబర్స్ పోస్ట్ చేసిన మెసేజ్‌ను అడ్మిన్ సెలెక్ట్ చేస్తే చాట్ పేజీ పై 'డిలీట్' ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్', 'డిలీట్ ఫర్ మీ', 'క్యాన్సిల్' అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. 'డిలీట్ ఫర్ ఎవ్రీవన్' సెలెక్ట్ చేస్తే సదరు మెసేజ్ గ్రూపు నుంచి డిలీట్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది.
ఇక వీటితో పాటు కొన్ని ప్రైవసీ ఫీచర్లను కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. గ్రూప్‌లో మెంబర్స్‌గా ఉండడం ఇష్టంలేనివారు ఇతరులకు తెలియకుండా సైలెంట్‌గా గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వొచ్చు. అడ్మిన్‌లకు మాత్రమే గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిన విషయం తెలుస్తుంది. అలాగే డిజప్పియరింగ్ మెసేజ్ టైమ్ లిమిట్‌ను కూడా రెండు రోజుల 12 గంటలకు పొడిగించింది. రీసెంట్‌గా 'వ్యూవన్' ఫీచర్ ద్వారా పంపే ఫైల్స్‌ను స్క్రీన్ షాట్ తీసుకునే సదుపాయాన్ని కూడా వాట్సాప్ తొలగించింది.