ఛానెల్స్‌లో పోల్స్, మల్టిపుల్ అడ్మిన్స్.. వాట్సా్ప్‌లో కొత్త ఫీచర్లు!
మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఛానెల్స్ కోసం పలు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో పోల్స్, మల్టిపుల్ అడ్మిన్స్, వాయిస్ నోట్స్ వంటి ఫీచర్లున్నాయి.
మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఛానెల్స్ కోసం పలు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో పోల్స్, మల్టిపుల్ అడ్మిన్స్, వాయిస్ నోట్స్ వంటి ఫీచర్లున్నాయి. ఇవెలా పనిచేస్తాయంటే..
వాట్సాప్ ఛానెల్ అనేది వన్-వే బ్రాడ్‌కాస్టింగ్ టూల్. ఫేస్‌బుక్ పేజీల మాదిరిగా ఫాలోవర్లకు కంటెంట్ షేర్ చేసేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుంది. రీసెంట్‌గా అందుబాటులోకి వచ్చిన ఛానెల్స్‌లో ఇప్పుడు మరిన్ని కొత్త హంగులు యాడ్ అవ్వనున్నాయి.
వాట్సాప్ ఛానెల్స్‌లో రాబోతున్న పోల్స్ ఆప్షన్ ద్వారా ఛానెల్ క్రియేటర్లు ఫాలోవర్స్‌తో మరింత బెటర్‌గా ఎంగేజ్ అయ్యేందుకు వీలుంటుంది. పోల్స్ సాయంతో ఛానెల్ అడ్మిన్లు వారి ఆడియెన్స్ అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. పోల్ పెట్టి మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం ద్వారా ఫాలోవర్స్‌తో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
వాట్సాప్ ఛానెల్స్‌లో రానున్న మరో ఫీచర్ వాయిస్ నోట్స్. ఛానెల్ అడ్మిన్‌లు తమ ఫాలోవర్లతో మరింత బెటర్‌గా కమ్యూనికేట్ చేసేందుకు ఈ వాయిస్ నోట్స్ సహకరిస్తాయి.
వాట్సాప్ ఛానెల్స్‌కు స్టేటస్ ఆప్షన్ కల్పిస్తూ వాట్సా్ప్ మరో ఫీచర్ తీసుకురానుంది. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు తాము ఫాలో అవుతున్న ఛానెల్స్ నుంచి నేరుగా స్టేటస్ అప్‌డేట్స్ పొందొచ్చు.
వాట్సాప్ ఛానెల్స్‌లో రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ మల్టిపుల్ అడ్మిన్స్. ఈ ఫీచర్ ద్వారా ఛానెల్స్‌లో గ్రూప్ మేనేజ్‌మెంట్ చేసుకునే వీలుంటుంది. సంస్థలకు చెందిన ఛానెల్స్‌కు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఛానెల్స్‌కు ఏకంగా 16 అడ్మిన్స్‌ను ఎలో చేస్తున్నట్టు వాట్సాప్ పేర్కొంది. ఈ ఫీచర్లన్నీ రాబోయే వాట్సాప్ అప్ డేట్‌తో అందుబాటులోకి రానున్నాయి.