వాట్సాప్ క్రాస్ పోస్టింగ్ ఫీచర్! ఎలా పనిచేస్తుందంటే..

ఒక ప్లాట్‌ఫామ్‌లోని పోస్ట్‌లను మరో ఫ్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసుకునే సదుపాయాన్నే ‘క్రాస్ పోస్టింగ్’ అంటుంటారు.

Advertisement
Update:2023-12-08 09:00 IST

వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త ఫీచర్లు!

ఒక ప్లాట్‌ఫామ్‌లోని పోస్ట్‌లను మరో ఫ్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసుకునే సదుపాయాన్నే ‘క్రాస్ పోస్టింగ్’ అంటుంటారు. అయితే ఇప్పటివరకూ ఆ ఫీచర్ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి యాప్స్‌లోనే ఉంది. ఇప్పుడు వాట్సాప్‌లో కూడా ఈ ఫీచర్ రానుంది.

వాట్సాప్‌లోని స్టేటస్ అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకేసారి పోస్ట్ చేసుకునేందుకు వీలుగా క్రాస్ పోస్టింగ్ ఫీచర్‌‌ను అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్ సంస్థ. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ఫేస్‌బుక్ స్టోరీలుగా ఎలా షేర్ చేయొచ్చో అదే విధంగా వాట్సాప్ స్టేటస్‌లను కూడా ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టుకోవచ్చు.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ సహా అన్ని మెటా అప్లికేషన్‌లలో ఒక యాప్‌లోని పోస్ట్‌ను మరో యాప్‌తో షేర్ చేసుకునే వీలుంటుంది. కంటెంట్ క్రియేటర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. వాట్సాప్‌లో స్టేటస్ క్రియేట్ చేసి దాన్నే ఇన్‌స్టా స్టోరీగా, ఫేస్ బుక్ స్టోరీగా పెట్టుకోవచ్చు.

వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. యూజర్లు ఏదైనా అప్‌డేట్ షేర్ చేయాలంటే వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టి మళ్లీ యాప్ నుంచి బయటకు వచ్చి ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లో సెపరేట్‌గా పోస్ట్ చేసే పనిలేకుండా ఒకేసారి అన్నింటిలో పోస్ట్ అప్‌డేట్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ ఎనేబుల్ చేయడానికి ఇన్‌స్టాలో కొత్త సెట్టింగ్ రాబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

ఇకపోతే దీంతోపాటు యూజర్ నేమ్ సెర్చ్ ఫీచర్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇకపై వాట్సాప్ యూజర్లు వారి అవసరాలు, ఇష్టాలకు అనుగుణంగా వారి ప్రైవసీ సెట్టింగ్‌లను కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌‌తో వాట్సాప్ కూడా మినీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది.

Tags:    
Advertisement

Similar News