చిటికెలో ఛాట్స్ బదిలీ! వాట్సాప్ కొత్త ఫీచర్!

క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వాట్సాప్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురాబోతోంది. రెండు ఫోన్లను ఒకే నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసి.. క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేస్తే చాలు. నిమిషాల్లో డేటా అంతా ట్రాన్స్‌ఫర్ అవుతుంది.

Advertisement
Update:2023-07-11 14:08 IST

పాత ఫోన్‌లోని వాట్సాప్ ఛాట్స్‌ను కొత్త ఫోన్‌లోకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే పాత ఫోన్‌లోని వాట్సాప్‌లో ఉన్న చాట్ హిస్టరీ, ఫైల్స్ , ఫొటోలు, వీడియోలను కొత్త ఫోన్‌లోకి బదిలీ చేసుకోవడానికి వాట్సాప్.. ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. దీంతో వాట్సాప్ హిస్టరీని సెకండ్లలో షేర్ చేసుకోవచ్చు.

క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వాట్సాప్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురాబోతోంది. రెండు ఫోన్లను ఒకే నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసి.. క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేస్తే చాలు. నిమిషాల్లో డేటా అంతా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అంతేకాదు, వాట్సాప్ హిస్టరీ మొత్తం ఎన్‌క్రిప్ట్ మోడ్‌లో ఉంటుంది. పర్సనల్ డేటా పూర్తిగా సేఫ్ అండ్ సెక్యూర్‌‌గా ఉంటుంది.

వాట్సాప్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేయడం కోసం థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించకుండా ఉండేందుకే ఈ టూల్‌ను తీసుకొస్తున్నట్టు మెటా సీఈవో జూకర్‌‌బర్గ్ పేర్కొన్నాడు. ఈ టూల్ ద్వారా చాటింగ్స్, ఫొటోలే కాకుండా పెద్ద పెద్ద ఫైల్స్, వీడియోలను కూడా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చని, డేటా అంతా ప్రైవేట్‌గా ఉంటుందని, ఇతరులకు తెలిసే అవకాశం లేదని జుకర్‌బర్గ్ తెలిపారు.

క్యూఆర్ స్కాన్ ద్వారా హిస్టరీ ట్రాన్స్ ఫర్ చేసేందుకు ముందుగా కొత్త, పాత ఫోన్లను ఒకే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయాలి. తర్వాత- పాత ఫోన్‌లో వాట్పాప్ యాప్ ఓపెన్ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లి, చాట్ ట్రాన్స్‌ఫర్‌పై క్లిక్ చేయాలి. అక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. కెమెరా ఓపెన్ అవుతుంది. తర్వాత కొత్త ఫోన్‌లో కనిపించే క్యూఆర్ కోడ్‌ను పాత ఫోన్ ద్వారా స్కాన్ చేయాలి. అంతే.. పాత ఫోన్‌లో ఉన్న వాట్సాప్ హిస్టరీ అంతా కొత్త ఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఫీచ‌ర్‌ బీటా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

Tags:    
Advertisement

Similar News