వివో నుంచి థిన్నెస్ట్ ఫోల్డబుల్ ఫోన్! ఫీచర్లు సూపర్!

వివో ఎక్స్ ఫోల్డ్ 3 లో డాల్బీ విజన్ సపోర్ట్, హెచ్‌డీఆర్ 10 సపోర్ట్‌, ఆర్మర్ గ్లాస్ కోటింగ్‌ , యూఎఫ్‌ఎస్ 4.0 స్టోరేజీ, ఇంటిగ్రేటెడ్ 3డీ అల్ట్రా-సోనిక్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, 5జీ, వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్ సీ, జీపీఎస్ కనెక్టివిటీ, ఐపీఎక్స్ 8 వాటర్ ప్రూఫ్ వంటి ఫీచర్లున్నాయి.

Advertisement
Update:2024-03-30 06:00 IST

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్స్ ట్రెండ్‌గా మారాయి. యాపిల్ కూడా ఫోల్డబుల్ ఐఫోన్‌పై పనిచేస్తుందని తెలిసిందే. అయితే ఈ ట్రెండ్‌లో భాగంగా వివో బ్రాండ్ నుంచి ఒక లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అవ్వబోతోంది. ఈ ఫోన్ ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం ఇండియాలో వన్‌ప్లస్ ఓపెన్, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ వంటి ఫోల్డబుల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే అత్యంత సన్నని డిజైన్‌తో ‘వివో ఎక్స్ ఫోల్డ్ 3’ పేరుతో మరో సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ లాంఛ్ అవ్వనుంది.

‘వివో ఎక్స్ ఫోల్డ్ 3’ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8 జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌పై ర‌న్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.5 ఇంచెస్ కవర్ డిస్‌ప్లేతోపాటు 8 -అంగుళాల ప్రైమరీ 2కె అమోలెడ్ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఇది 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది.

కెమెరాల విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 50 ఎంపీ వైడ్‌యాంగిల్ సెన్సర్‌‌తో పాటు 64 ఎంపీ పోట్రెయిట్ సెన్సర్‌‌ ఉంది. అలాగే రెండు 32 ఎంపీ సెన్సర్ ఫ్రంట్ కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే ఇందులో అమర్చిన 5500ఎంఏహెచ్ బ్యాట‌రీ.. 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను స‌పోర్ట్ చేస్తుంది.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 లో డాల్బీ విజన్ సపోర్ట్, హెచ్‌డీఆర్ 10 సపోర్ట్‌, ఆర్మర్ గ్లాస్ కోటింగ్‌ , యూఎఫ్‌ఎస్ 4.0 స్టోరేజీ, ఇంటిగ్రేటెడ్ 3డీ అల్ట్రా-సోనిక్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్, 5జీ, వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్ సీ, జీపీఎస్ కనెక్టివిటీ, ఐపీఎక్స్ 8 వాటర్ ప్రూఫ్ వంటి ఫీచర్లున్నాయి.

ఈ ఫోన్‌లో డిజైన్ అత్యంత ప్రత్యేకంగా ఉండనుంది. ఫోల్డ్ చేసిన‌ప్పుడు ఫోన్ మందం కేవ‌లం 4.65 ఎంఎం మాత్రమే ఉంటుంది. అందుకే దీన్ని ‘థిన్నెస్ట్ ఫోల్డబుల్ ఫోన్’గా వివో ప్రమోట్ చేస్తుంది. ఇది 14.98 గ్రాముల బరువున్న కార్బన్ ఫైబర్ ప్యానెల్‌తో తయారైంది. కాబట్టి ఇది మిగతా ఫోల్డబుల్ ఫోన్స్ కంటే 37 శాతం తేలికగా ఉంటుందట. అలాగే ఈ మొబైల్ సుమారు 5 లక్షల ఫోల్డ్‌లను తట్టుకోగలదని కంపెనీ ధృవీకరించింది. ఇక ధర విషయానికొస్తే బేస్ వేరియంట్(16జీబీ+ 512జీబీ) సుమారు రూ.లక్ష వరకూ ఉండొచ్చు.

Tags:    
Advertisement

Similar News