వివో ‘వీ’ సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు!

వివో నుంచి ‘వివో వీ40 (Vivo V40)’, ‘వివో వీ40 ప్రో (Vivo V40 Pro)’ పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. సరికొత్త జిస్ లెన్స్ కెమెరాలు ఈ మొబైల్స్‌లోని ప్రత్యేకత.

Advertisement
Update: 2024-08-09 10:58 GMT

ప్రముఖ మొబైల్‌ బ్రాండ్ వివో నుంచి ‘వీ’ సిరీస్‌లో భాగంగా రెండు కొత్త ఫోన్లను ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయ్యాయి. వీటి ధరలు, స్పెసిఫికేషన్ల వివరాల్లోకి వెళ్తే.

వివో నుంచి ‘వివో వీ40 (Vivo V40)’, ‘వివో వీ40 ప్రో (Vivo V40 Pro)’ పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. సరికొత్త జిస్ లెన్స్ కెమెరాలు ఈ మొబైల్స్‌లోని ప్రత్యేకత.

వివో వీ40 మొబైల్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది120హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేటుని సపోర్ట్ చేస్తుంది. 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంటుంది.

వివో వీ40 లో 50 ఎంపీ జిస్‌ (zeiss) బ్రాండెడ్ సెన్సర్‌‌తో కూడిన కెమెరా, 50 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరాతో పాటు మరో 50 ఎంపీ సెల్ఫీ కెమెరాలున్నాయి. ప్రైమరీ కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఉంది.

ఇక వివో వీ40 ప్రో విషయానికొస్తే.. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్ ఫన్‌టచ్‌ ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇందులో కూడా 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది120హెర్ట్జ్ రిఫ్రెష్‌ రేట్, 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉంటుంది.

వివో వీ40 ప్రోలో జిస్‌ (zeiss) బ్రాండెడ్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్921 సెన్సర్‌, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 816 టెలిఫోటో సెన్సర్, మరో 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

ఇక రెండు మొబైల్స్‌లో 80వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఐపీ68 రేటింగ్‌, 5జీ, బ్లూటూత్‌ 5.3, వైఫై 5, స్టీరియో స్పీకర్స్ వంటి ఫీచర్లున్నాయి.

వివో వీ40 బేస్ వేరియంట్‌(8జీబీ+ 128జీబీ) ధర రూ.34,999 నుంచి మొదలవుతుంది. బ్లూ, లోటస్‌ పర్పుల్‌, టైటానియం గ్రే రంగుల్లో లభిస్తుంది.

వివో వీ40 ప్రో బేస్ వేరియంట్‌( 8జీబీ+ 256జీబీ) ధర రూ.49,999 నుంచి మొదలవుతుంది. బ్లూ, టైటానియం గ్రే రంగుల్లో లభిస్తుంది.

Tags:    
Advertisement

Similar News