Vivo Y36 | వివో నుంచి మార్కెట్‌లోకి మ‌రో బ‌డ్జెట్ ఫోన్‌.. రూ.16,999లకే.. ఇవీ డిటైల్స్‌!

Vivo Y36 | `వై` సిరీస్‌లో `వివో వై 36 (Vivo Y36)` పేరుతో ఆవిష్క‌రించింది. రెండు రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధ‌ర రూ.16,999 (ఎక్స్ షోరూమ్‌) మాత్ర‌మే.

Advertisement
Update:2023-06-23 12:41 IST

Vivo Y36 | వివో నుంచి మార్కెట్‌లోకి మ‌రో బ‌డ్జెట్ ఫోన్‌.. రూ.16,999లకే.. ఇవీ డిటైల్స్‌!

Vivo Y36 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. దేశీయ మార్కెట్లోకి మ‌రో బ‌డ్జెట్ ఫోన్ తీసుకొచ్చింది. `వై` సిరీస్‌లో `వివో వై 36 (Vivo Y36)` పేరుతో ఆవిష్క‌రించింది. రెండు రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ధ‌ర రూ.16,999 (ఎక్స్ షోరూమ్‌) మాత్ర‌మే. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డుతో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినా, ఈఎంఐ ఆప్ష‌న్‌తో కొన్నా, ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ రూ.1,500 క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ చేస్తుంది. ఎస్బీఐ కార్డ్స్‌, ఈఎంఐ ట్రాన్సాక్ష‌న్ల‌పై కొనుగోలు చేసిన వారికి రూ.500 క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది.

స్నాప్ డ్రాగ‌న్ 680 ఎస్వోసీ చిప్‌సెట్, 2.5 క‌ర్వ్‌డ్ గ్లాస్ బాడీ క‌లిగి ఉంటుంది. వివో వై 36 (Vivo Y36) సింగిల్ స్టోరేజీ వేరియంట్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉంది. మీట‌ర్ బ్లాక్‌, వైబ్రంట్ గోల్డ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో వ‌స్తున్న‌ది. వివో ఇండియా ఈ స్టోర్, ఫ్లిప్ కార్ట్‌తోపాటు అన్ని పార్ట‌న‌ర్ రిటైల్ స్టోర్ల‌లో ల‌భిస్తుంది. డ్యూయ‌ల్ సిమ్ ఆప్ష‌న్ క‌ల వివో వై 36 (Vivo Y36) ఆండ్రాయిడ్ 13 విత్ ఫ‌న్‌ట‌చ్ ఓఎస్ వ‌ర్ష‌న్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ 6.64 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080x2388 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్‌ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వ‌స్తున్న‌ది.

వివో వై 36 (Vivo Y36) ఫోన్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్ క‌లిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమ‌రీ సెన్స‌ర్ విత్ ఎఫ్/ 1.8 లెన్స్ క‌మెరా, 2-మెగా పిక్సెల్ బోకెహ్ షూట‌ర్‌, ఫ్రంట్‌లో సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్స్ విత్ ఎఫ్‌/2.0 అపెర్చ‌ర్ కెమెరా ఉంటాయి. ఎటువంటి ప‌రిస్థితుల్లోనైనా.. అంటే సూప‌ర్ నైట్ మోడ్‌, మ‌ల్టీ స్ట‌యిల్ పొర్ట్రైట్ త‌దిత‌ర మోడ్స్‌లోనూ ఫొటోలు తీయ‌డానికి వీలుగా కెమెరాలు ఉంటాయి.

128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ కెపాసిటీ గ‌ల ఈ ఫోన్‌లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వ‌ర‌కు స్టోరేజీ పెంచుకోవ‌చ్చు. ఇక‌ వివో వై 36 (Vivo Y36) వై-ఫై, బ్లూటూత్ 5, జీపీఎస్‌, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ క‌లిగి ఉంటుంది. అథంటికేష‌న్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌తోపాటు యాక్సిలోమీట‌ర్‌, అంబిలెంట్ లైట్ సెన్స‌ర్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్‌, ఈ-కంపాస్‌, గైరోస్కోప్ వంటి సెన్స‌ర్లు ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News