యూజర్‌‌నేమ్, సీక్రెడ్ కోడ్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు!

యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అందులో భాగంగానే యూజర్‌‌నేమ్స్ అనే ఫీచర్‌‌ను అనౌన్స్ చేసింది. అయితే త్వరలోనే ఈ ఫీచర్ ఎంట్రీ ఇవ్వనుందని వాట్సాప్ బీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పేర్కొంది.

Advertisement
Update:2024-08-22 19:27 IST

యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అందులో భాగంగానే యూజర్‌‌నేమ్స్ అనే ఫీచర్‌‌ను అనౌన్స్ చేసింది. అయితే త్వరలోనే ఈ ఫీచర్ ఎంట్రీ ఇవ్వనుందని వాట్సాప్ బీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పేర్కొంది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ కూడా షేర్ చేసింది.

వాట్సాప్‌లో ప్రైవసీని మెరుగుపరిచేందుకు యూజర్‌‌నేమ్స్ అనే ఫీచర్ తీసుకొస్తున్నట్టు వాట్సాప్ చెప్తోంది. ఈ ఫీచర్ వస్తే మొబైల్‌ నంబర్‌తోనే పనిలేకుండా మెసేజ్‌ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తరహాలో యూజర్‌‌నేమ్స్ ద్వారానే యూజర్లు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వొచ్చు. ఈ ఫీచర్ వస్తే మొబైల్‌ నెంబర్‌ సేఫ్టీ గురించి భయపడాల్సిన పని ఉండదు.

వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌లో యూజర్‌నేమ్‌తో పాటు నాలుగు అంకెల పిన్‌ను కూడా క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యూజర్‌‌నేమ్‌ను సెర్చ్ చేసి ఎవరైనా మీకు మెసేజ్ చేయాలంటే వాళ్లు ఆ పిన్‌ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిన్‌ లేకుండా ఎవరూ మీకు మెసేజ్ చేయలేరు. అంటే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు ఇకపై తగ్గుతాయన్న మాట.

వాట్సాప్ గతంలో తీసుకొచ్చిన చాట్ లాక్ ఫీచర్‌‌కు కొనసాగింపుగా ఇప్పుడు సీక్రెట్ కోడ్ ఫీచర్‌‌ను తీసుకొచ్చింది. యూజర్లు లాక్ చేసిన చాట్‌లను సీక్రెట్ కోడ్ ద్వారా హైడ్ చేసుకోవచ్చు. యూజర్లు చాట్‌ని సెలక్ట్ చేసుకుని పాస్‌వర్డ్ ద్వారా లాక్ చేసుకోవచ్చు. అలా లాక్ చేసిన చాట్‌లు వాట్సాప్ మెయిన్ స్క్రీన్ పై కనిపించవు. సెర్చ్ బార్‌‌లో సీక్రెట్ కోడ్‌ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే అవి ఓపెన్ అవుతాయి.

ఇక వీటితోపాటు స్పామ్‌ మెసేజ్‌లకు చెక్ పెడుతూ ఐపీ అడ్రెస్ బ్లాక్ అనే మరో సెక్యూరిటీ ఫీచర్‌ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే స్పామ్ మెసేజెస్ ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతాయి. వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీలో ‘అడ్వాన్స్‌డ్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి ‘ప్రొటెక్ట్ ఐపీ అడ్రెస్ ఫ్రమ్ కాల్స్’ను ఎనేబుల్ చేసుకుంటే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది.

Tags:    
Advertisement

Similar News