జూన్ నెలలో రాబోయే మొబైల్స్ ఇవే!

జూన్ నెలలో వన్‌ప్లస్ నుంచి నార్డ్ సిరీస్, షాయోమీ నుంచి సరికొత్త మోడల్‌తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫోన్లు లాంఛ్ అవ్వనున్నాయి.

Advertisement
Update:2024-05-29 14:49 IST

ఎప్పటిలాగేనే వచ్చే నెలలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్స్ లాంఛ్ అవ్వనున్నాయి. జూన్ నెలలో రిలీజ్ అవ్వబోయే మొబైళ్లు, వాటి ఫీఛర్ల వివరాల్లోకి వెళ్తే.

జూన్ నెలలో వన్‌ప్లస్ నుంచి నార్డ్ సిరీస్, షాయోమీ నుంచి సరికొత్త మోడల్‌తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫోన్లు లాంఛ్ అవ్వనున్నాయి. వాటిలో కొన్ని ఇవీ.

మోటో జీ 85

వచ్చే నెల రెండో వారంలో మోటొరోలా నుంచి మోటో జీ85 మొబైల్ లాంఛ్ అవ్వొచ్చు. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 3 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 6.5 ఇంచెస్ పీఓఎల్‌ఈడీ స్క్రీన్ ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ధర సుమారు రూ.26000 ఉండొచ్చు.

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో

జూన్ 6న వివో నుంచి ‘వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో’ పేరుతో ఫోల్డబుల్ మొబైల్ లాంఛ్ అవ్వనుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్3 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8.03 అంగుళాల అమోలెడ్ మెయిన్ స్క్రీన్ డిస్ ప్లే ఉంటాయి. అలాగే ఇందులో ఉండే 5,700ఎంఏహెచ్ బ్యాటరీ.. 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ధర సుమారు రూ. లక్ష వరకూ ఉండొచ్చు.

వన్‌ప్లన్ నార్డ్ సీఈ4 లైట్

వన్‌ప్లన్ బ్రాండ్ నుంచి వచ్చే నెలలో నార్డ్ సీఈ4 లైట్ మొబైల్ రానుంది. ఇది జూన్ రెండో వారంలో రిలీజ్ అవ్వొచ్చు. ఇది స్నాప్‌డ్రాగన్ 6జెన్ 1 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. 6.7 ఇంచెస్ పంచ్ హోల్ డిస్‌ప్లేతోపాటు 48 మెగాపిక్సెల్ సెన్సర్‌‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ధర సుమారు రూ. 25,000 ఉండొచ్చు.

షావోమీ సీవీ4 ప్రో.

జూన్ రెండో వారంలో షావోమీ నుంచి సీవీ 4 ప్రో మొబైల్ లాంఛ్ అవ్వనుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ ఉండొచ్చు. అలాగే ఇందులో ప్రీమియం జిస్ కెమెరా లెన్స్‌లు ఉంటాయి. కర్వ్‌డ్ డిస్‌ప్లేతో పాటు 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ధర సుమారు రూ. 50,000 ఉండొచ్చు.

మోటో ఎడ్జ్ 50 అల్ట్రా

మోటో ఎడ్జ్ 50 అల్ట్రా మొబైల్.. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌‌పై పనిచేస్తుంది. ఇందులో 6.67 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి. ఇందులో 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు మరో రెండు 50 ఎంపీ సెన్సర్‌‌లు ఉండొచ్చు. ధర సుమారు రూ.80,000 వరకూ ఉండొచ్చు.

Tags:    
Advertisement

Similar News