అక్టోబర్‌‌లో రిలీజయ్యే ఫోన్లు ఇవే..

అక్టోబర్ నెలలో దీపావళి సందర్భంగా స్పెషల్ సేల్స్ అందుబాటులోకి వస్తాయి. అలాగే ఈ నెలలో కొన్ని కొత్త ఫోన్లు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి.

Advertisement
Update:2022-10-06 13:00 IST

అక్టోబర్ నెలలో దీపావళి సందర్భంగా స్పెషల్ సేల్స్ అందుబాటులోకి వస్తాయి. అలాగే ఈ నెలలో కొన్ని కొత్త ఫోన్లు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి. కొత్త మొబైల్ కొనాలనుకునే వారు వీటిపై కూడా ఓ లుక్కేయొచ్చు.

పిక్సెల్ 7 సిరీస్‌

గూగుల్ పిక్సెల్ 7 సిరీస్‌.. భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో పేరుతో రెండు మోడల్స్‌ను అక్టోబరు 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. వీటి ధర రూ. 55 వేల నుంచి మొదలవ్వొచ్చు. ఇందులో ఐపీ 68 రేటింగ్, వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్లతో పాటు 50 ఎంపీ కెమెరా లాంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫోన్ ధర రూ.50,000 నుంచి రూ. 70,000 ఉండొచ్చు.

మోటో ఎడ్జ్‌ 30 నియో

అక్టోబరు నెలలో మోటోరోలో నుంచి ఎడ్జ్‌ 30 నియో మోడల్‌ విడుదల అవ్వబోతోంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.28 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ డిస్‌స్లే ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 64 ఎంపీ, 13 ఎంపీ కెమెరాలు, 4,020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ. 20 వేలలోపు ఉండొచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 3

వన్‌ప్లస్ తమ నార్డ్‌ సిరీస్‌ నుంచి మరో ఫోన్ తీసుకురాబోతోంది. వన్‌ప్లస్‌ నార్డ్ 3 పేరుతో విడుదల చేయనున్న ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌ను ఉపయోగించారట. ఇందులో 50 ఎంపీ కెమెరా, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ధర రూ. 30 వేలు ఉండొచ్చు.

షావోమి 12టీ సిరీస్

6.67 అంగుళాల 2కె అమోలెడ్ డిస్‌ప్లేతో రాబోతున్న షావోమీ 12టీ సిరీస్ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 120 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, వెనుకవైపు 200 ఎంపీ కెమెరా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్ ‌1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీని ధర రూ. 50 వేల వరకూ ఉండొచ్చు.

షావోమి 12 లైట్‌

షావోమీ 12 సిరీస్ నుంచి 12లైట్ మొబైల్ కూడా విడుదల అవ్వబోతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 67 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక 108 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఉంటాయి. ధర రూ. 30 వేల లోపు ఉంటుంది.

రియల్‌మీ 10 సిరీస్‌

రియల్‌మీ కంపెనీ అక్టోబర్ నెలలో 10 సిరీస్‌ నుంచి వేర్వేరు వేరియంట్లను విడుదల చేయనుంది. రియల్ మీ10 ప్రో, 10 5జీ, 10 అల్ట్రా, 10+ వేరియంట్లు రిలీజ్ అయ్యే ఛాన్సుంది. ఈ ఫోన్ల ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే రియల్‌మీ జీటీ నియో 4 పేరుతో తీసుకొస్తున్న మరో ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌, 1.5కె అమోలెడ్ డిస్‌ప్లే ఉండబోతుందని సమాచారం.

పోకో ఎమ్‌5ఎస్‌

ఎమ్‌ సిరీస్‌లో పోకో నుంచి వస్తోన్న ఆరో మోడల్‌ ఇది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. ధర రూ.15 వేల లోపు ఉండొచ్చు.

ఒప్పో ఏ సిరీస్‌

ఈ నెలలో ఒప్పో ఏ సిరీస్‌ నుంచి ఒప్పో ఏ17 , ఒప్పో ఏ77ఎస్‌ అనే రెండు బడ్జెట్ ఫోన్లు రాబోతున్నాయి. ఈ రెండు ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.50 ఎంపీ కెమెరా, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. వీటి ధర రూ.9 వేల నుంచి రూ.10 వేల మధ్య ఉండొచ్చు.

Tags:    
Advertisement

Similar News