స్పామ్ కాల్స్‌కు చెక్! ట్రాయ్ కొత్త రూల్స్!

క‌స్టమ‌ర్లకు వ‌చ్చే కాల్స్‌, ఎస్ఎంఎస్ స‌ర్వీసుల్లో ఫ్రాడ్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌ను గుర్తించ‌డానికి ఎయిర్‌టెల్‌, బీఎస్ఎన్ఎల్‌, జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు ఏఐ స్పామ్ ఫిల్టర్స్ వాడాల‌ని ట్రాయ్ కొన్ని రూల్స్ పెట్టింది.

Advertisement
Update: 2023-05-05 09:22 GMT

స్పామ్ కాల్స్‌కు చెక్! ట్రాయ్ కొత్త రూల్స్!

యూజర్లకు ఇబ్బందిపెట్టే స్పామ్ కాల్స్‌, స్పామ్ మెసేజ్‌లను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేట‌రీ అధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఏఐ టూల్స్ ద్వారా స్పామ్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌ను ఫిల్టర్ చేయాల‌ని టెలికాం ఆపరేటర్లుకు సూచించింది.

క‌స్టమ‌ర్లకు వ‌చ్చే కాల్స్‌, ఎస్ఎంఎస్ స‌ర్వీసుల్లో ఫ్రాడ్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌ల‌ను గుర్తించ‌డానికి ఎయిర్‌టెల్‌, బీఎస్ఎన్ఎల్‌, జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు ఏఐ స్పామ్ ఫిల్టర్స్ వాడాల‌ని ట్రాయ్ కొన్ని రూల్స్ పెట్టింది. స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్న కేసులు ఇటీవల బాగా పెరిగాయని, ఈ ఇబ్బందులను తగ్గించడానికి ఏఐ స్పామ్ ఫిల్టర్లు బాగా ఉపయోగపడతాయని ట్రాయ్ పేర్కొంది.

ట్రాయ్ రూల్స్‌కు అనుగుణంగా ఏఐ ఫిల్టర్ స‌ర్వీస్‌ను వాడేందుకు ఎయిర్‌టెల్‌, రిల‌య‌న్స్ జియో సంస్థలు ముందుకొచ్చాయి. ఏఐ ఫిల్టర్ స‌ర్వీస్‌ను వాడతామని ఎయిర్ టెల్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. జియో కూడా త్వర‌లో ప్రారంభిస్తామ‌ని పేర్కొంది. ఇదిలా ఉంటే క‌స్టమ‌ర్లు త‌మ‌కు కాల్ చేసే వారిని గుర్తించ‌డానికి కాల‌ర్ ఐడీ ఫీచ‌ర్ తీసుకురావాలని కేంద్రం టెలికాం సంస్థల‌ను కోరింది. కానీ, కొన్ని ప్రైవ‌సీ కార‌ణాల వల్ల కాల‌ర్ ఐడీ ఫీచ‌ర్ వాడేందుకు జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికం సంస్థలు నిరాకరించాయి.


Tags:    
Advertisement

Similar News