ఈ యాప్‌తో స్పామ్ కాల్స్‌కు చెక్!

మొబైల్ యూజర్లకు స్పామ్ కాల్స్‌తో ఉండే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మార్కెటింగ్ కాల్స్ నుంచి ఆటోమేటెడ్ కాల్స్ వరకూ అదేపనిగా స్పామ్ కాల్స్ విసిగిస్తుంటాయి.

Advertisement
Update: 2024-08-17 01:30 GMT

మొబైల్ యూజర్లకు స్పామ్ కాల్స్‌తో ఉండే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మార్కెటింగ్ కాల్స్ నుంచి ఆటోమేటెడ్ కాల్స్ వరకూ అదేపనిగా స్పామ్ కాల్స్ విసిగిస్తుంటాయి. అయితే వీటికి చెక్ పెడుతూ ట్రాయ్ ఓ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. అదేంటంటే..

స్పామ్ కాల్స్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టతరమైన పని. ఆయా నెంబర్లను బ్లాక్ చేసినా రకరకాల కొత్త నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్ వస్తుంటాయి. అయితే ఇప్పుడు వాటన్నింటికీ చెక్ పెడుతూ ట్రాయ్(టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త యాప్ డిజైన్ చేసింది. అదే ‘డీఎన్‌డీ 3.0’. ఇదెలా పనిచేస్తుందంటే..

యూజర్లు ప్లే స్టోర్ నుంచి డీఎన్ డీ 3.0 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి కాల్స్, మెసేజ్‌లు, కాంటాక్ట్స్ వంటి పర్మిషన్లు ఇవ్వాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్, ఓటీపీ ఎంటర్ చేసి యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.

యాప్‌లోకి లాగిన్ అయ్యాక అక్కడ డీఎన్‌డీ ప్రిఫరెన్సులు కనిపిస్తాయి. ఎలాంటి కాల్స్‌ను వద్దనుకుంటున్నారో అక్కడ సెలక్ట్‌ చేసుకోవచ్చు. హెల్త్, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, ఎడ్యుకేషన్‌.. ఇలా కేటగిరీల వారీగా వద్దనుకున్న స్పామ్ కాల్స్‌ను బ్లాక్ చేయొచ్చు. ఇలా చేస్తే చాలావరకూ ఆయా కేటగిరీల కాల్స్ ఆగిపోతాయి.

బ్లాక్ చేసిన తర్వాత కూడా కాల్స్ లేదా మెసేజ్‌ల వంటివి వస్తుంటే యాప్ లోనే రిపోర్ట్‌ యూసీసీ అనే ఆప్షన్‌ ద్వారా ఆ నంబర్‌పై టెలికాం సర్వీసు ప్రొవైడర్‌కు కంప్లెయింట్ చేయొచ్చు. కంప్లెంట్ చేసిన తర్వాత తదుపరి యాక్షన్స్ ఏం తీసుకున్నారో అక్కడ చూపిస్తుంది. అలా ఈ యాప్ సాయంతో స్పామ్ కాల్స్ నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ యాప్‌లో కొన్ని బగ్స్ ఉన్నాయని త్వరలోనే వాటిని క్లియర్ చేస్తామని ట్రాయ్ అధికారులు చెప్తున్నారు.

Tags:    
Advertisement

Similar News