ఆగస్టులో రిలీజయ్యే ఫోన్లు ఇవే..

టాప్ బ్రాండ్స్ నుంచి చిన్న బ్రాండ్స్ వరకూ అన్ని సంస్థలు ఈ నెలలో మొబైల్స్ లాంఛ్ చేయనున్నాయి.

Advertisement
Update:2023-08-03 17:39 IST

ఆగస్టులో రిలీజయ్యే ఫోన్లు ఇవే..

టెక్ ప్రియులను ఎంతోకాలంగా ఊరిస్తున్న కొన్ని లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ ఈ నెలలో రిలీజ్ అవ్వనున్నాయి. టాప్ బ్రాండ్స్ నుంచి చిన్న బ్రాండ్స్ వరకూ అన్ని సంస్థలు ఈ నెలలో మొబైల్స్ లాంఛ్ చేయనున్నాయి. వాటి వివరాలపై ఓ లుక్కేస్తే..

వన్‌ప్లస్‌ ఓపెన్

వన్ ప్లస్ లవర్స్‌ను ఎప్పటినుంచో ఊరిస్తున్న వన్‌ప్లస్‌ ఫోల్డింగ్ ఫోన్ ఎట్టకేలకు ఆగస్టు నెలలో మార్కెట్లోకి రానుంది. ఆగస్టు 29న వన్‌ప్లస్ ఫోల్డింగ్ ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్టు వన్‌ప్లస్ ప్రకటించింది. ‘వన్‌ప్లస్‌ ఓపెన్’ లేదా ‘వన్‌ప్లస్‌ 11 ఫోల్డ్’ పేరుతో ఈ ఫోన్‌ మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ తెరిచినప్పుడు 7.8 ఇంచెస్, మూసినప్పుడు 6.3 ఇంచెస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో క్వాల్‌కామ్న్ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 2 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 64 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో 4,800 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ ఉండబోతోంది. దీని ధర సుమారు రూ.లక్ష ఉండొచ్చు.

రియల్‌మీ జీటీ నియో 6

రియల్‌మీ సంస్థ కూడా ఈ నెలలో తమ బ్రాండ్ న్యూ ‘జీటీ నియో 6’ మొబైల్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ రెండు ప్రాసెసర్ల వేరియంట్లతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 2 ప్రాసెసర్ తోపాటు మీడియాటెక్‌ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో కూడిన మోడల్ కూడా రిలీజ్ అవుతోంది. ఇందులో 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు 4,600 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. ఇది 240 వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ధరల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌34 5జీ

శాంసంగ్ బ్రాండ్ ఈ నెలలో ‘గెలాక్సీ ఎఫ్ 34 5జీ’ పేరుతో ఓ మిడ్ రేంజ్ ఫోన్ మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఫోన్..120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.4 ఇంచెస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో శాంసంగ్ ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్‌ను వాడారు. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. దీని ధర రూ. 25000 లోపు ఉండొచ్చు.

రెడ్‌మీ 12 5జీ

షావోమీ సబ్ బ్రాండ్ అయిన రెడ్‌మీ బ్రాండ్ నుంచి ఈ నెలలో ‘రెడ్ మీ 12 5జీ’ అనే ఫోన్ రాబోతోంది. ఇందులో 90 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.79 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

పొకో ఎఫ్‌ 5 సిరీస్‌

షావోమీ సబ్ బ్రాండ్ అయిన పోకో నుంచి కూడా ఈ నెలలో కొత్త సిరీస్ లాంచ్ అవ్వబోతోంది. ‘పొకో ఎఫ్‌ 5’, ‘పొకో ఎఫ్‌ 5 ప్రో’ పేరుతో రెండు మోడల్స్‌ రాబోతున్నాయి. పొకో ఎఫ్‌ 5 లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక పొకో ఎఫ్‌5 ప్రో విషయానికొస్తే.. ఇందులో 6.67-అంగుళాల డబ్ల్యూక్యూహెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది.

వివో వీ29 సిరీస్‌

వివో బ్రాండ్ నుంచి ఈ నెలలో వివో వీ29 , వీ29ఈ పేర్లతో రెండు వేరియంట్లు రాబోతున్నాయి. వీటిలో 6.67 ఇంచెస్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. వీ29 మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌, వీ29 ఈ వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వీ 29లో 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, వీ 29ఈ లో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ రెండు ఫోన్లు రూ. 40 వేల లోపు ఉండొచ్చని అంచనా.

ఐకూ జెడ్ 7 ప్రో

వివో సబ్ బ్రాండ్ అయిన ఐకూ నుంచి ఈ నెలలో కర్వ్‌డ్‌ డిస్‌ప్లే ఫోన్ రాబోతోంది. ఆగస్టు 13న రిలీజ్ అవుతున్న ‘ఐకూ జెడ్ 7 ప్రో’ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 782 జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.ధర వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

మోటోరోలా జీ14

మోటోరోలా నుంచి ఈ నెలలో ఓ మిడ్‌రేంజ్‌ ఫోన్ రాబోతోంది. ఇందులో 6.5-ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటుంది. ఇది మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ధర రూ.20,000 లోపు ఉండొచ్చు.

ఇక వీటితోపాటు వన్‌ప్లస్‌ ఏస్‌2 ప్రో , షావోమి ఫోల్డ్‌ 3 వంటి మోడల్స్‌తో పాటు హానర్ బ్రాండ్ నుంచి కూడా కొన్ని మోడల్స్ మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News