మొబైల్ యాప్స్ స్లో అవుతున్నాయా? ఇలా చేసి చూడండి!
అవసరానికో యాప్ చొప్పున ఫోన్ లో బోలెడు యాప్స్ ఉంటున్నాయి. అయితే వీటిలో కొన్ని యాప్స్ ఊరికే మొరాయిస్తుంటాయి. ఉన్నట్టుండి స్లో అవ్వడం, మధ్యలోనే క్విట్ అవ్వడం, స్ట్రక్ అయిపోవడం వంటివి జరుగుతుంటాయి.
అవసరానికో యాప్ చొప్పున ఫోన్ లో బోలెడు యాప్స్ ఉంటున్నాయి. అయితే వీటిలో కొన్ని యాప్స్ ఊరికే మొరాయిస్తుంటాయి. ఉన్నట్టుండి స్లో అవ్వడం, మధ్యలోనే క్విట్ అవ్వడం, స్ట్రక్ అయిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..
యాప్స్ పని చేయకపోవడానికి చాలా కారణాలుంటాయి. యాప్ డెవలపర్లు ఎప్పటికప్పుడు బగ్స్‌ను సరి చేయకపోవడం ఒక కారణమైతే.. యాప్ అప్‌డేట్ చేసుకోకపోవడం, యాప్ డేటా నిండడం, క్యాచీ ఎక్కువ అవ్వడం.. ఇలా ఇతర కారణాలు కూడా ఉంటాయి. యాప్స్ సరిగా పనిచేయనప్పుడు కొన్ని టిప్స్ ద్వారా సమస్యను సరి చేయొచ్చు.
యాప్ పనిచేయకపోవడానికి మొబైల్‌లో ఏదైనా ఎర్రర్ కూడా కారణమవ్వొ్చ్చు. కాబట్టి ఒకసారి ఫోన్ రీబూట్ చేసి చూడాలి. మొబైల్ స్విచాఫ్ చేసి ఒక నిముషం తర్వాత ఆన్ చేయాలి. ఇలా చేస్తే మొబైల్‌లోని బేసిక్ ఎర్రర్లన్నీ క్లియర్ అవుతాయి.
ఏదైనా యాప్ తరచూ మొరాయిస్తుంటే.. ఆ యాప్ అప్ టు డేట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఆ యాప్ సెర్చ్ చేసి చూడాలి. అక్కడ ‘అప్‌డేట్’ ఆప్షన్ చూపిస్తుంటే దానిపై క్లిక్ చేసి అప్‌డేట్ చేయాలి. సాధారణంగా యాప్స్‌లో వచ్చే బగ్స్‌ను అప్‌డేట్స్ ద్వారా సరిచేస్తుంటారు డెవలపర్లు. కాబట్టి యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చేసుకోవడం ముఖ్యం.
మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు, యాప్‌కు కంపాటబిలిటీ కుదరకపోయినా యాప్స్ మొరాయిస్తుంటాయి. కాబట్టి మొబైల్ ఓఎస్ అప్ టు డేట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సెట్టింగ్స్‌లో అప్ డేట్స్‌లోకి వెళ్లి ‘సిస్టమ్ అప్‌డేట్స్’ అందుబాటులో ఉంటే వెంటనే సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
యాప్స్ తరచూ స్లో అవ్వడానికి క్యాచీ లేదా యాప్ డేటా నిండిపోవడం కూడా కారణమవ్వొచ్చు. దాన్ని క్లియర్ చేయడం కోసం యాప్‌పై నొక్కి పట్టుకోవాలి. అప్పుడు ‘యాప్ ఇన్ ఫో’ అని కనిపిస్తుంది. అందులో ‘స్టోరేజ్ యూసేజ్’లోకి వెళ్లి ‘క్లియర్ క్యాచీ’పై క్లిక్ చేయాలి.
ఈ టిప్స్ ఏవీ పని చేయకపోతే యాప్ లేదా మొబైల్‌లో ఇతర సాంకేతిక కారణం ఉండి ఉండొచ్చు. అప్పుడు ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఒక్కటే ఆప్షన్. ఇలా చేయడం ద్వారా మొబైల్ కొత్తదానిలా మారిపోతుంది.