మొబైల్ మార్చే ముందు ఇవి చేయడం మర్చిపోవద్దు!
న్యూ ఇయర్‌కు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఫోన్ మార్చేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి.
న్యూ ఇయర్‌కు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఫోన్ మార్చేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. పాత ఫోన్‌ను అమ్మడం లేదా ఇతరులకు ఇచ్చేముందు తప్పక చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి.
ఫోన్‌లో ఉండే పర్సనల్ డేటా, ఇతర వివరాలు దుర్వినియోగం అవ్వకుండా ఉండాలంటే ఫోన్ మార్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగా ఫోన్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు లేదా అమ్మేటప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుంటారు. రీసెట్‌తో డేటా అంతా క్లియర్ అయినప్పటికీ కొన్ని క్యాచీ ఫైళ్లు అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. హ్యాకింగ్ ద్వారా వివరాలను రికవరీ చేసే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి ఈ జాగ్రత్తలు ముఖ్యం.
క్యాచీ డిలీట్..
ఫోన్ మార్చేటప్పుడు పాత ఫోన్‌లో మీ బ్యాంకింగ్, యూపీఐకు సంబంధించిన డీటెయిల్స్ లేకుండా జాగ్రత్త పడాలి. బ్యాంకింగ్ యాప్‌లు, యూపీఐ యాప్స్‌ను లాగవుట్ చేసి డిలీట్ చేసేయాలి. అలాగే ‘యాప్ ఇన్ఫో’ లోకి వెళ్లి డేటా, క్యాచీ కూడా క్లియర్ చేస్తే బెటర్. వీటితోపాటు కాల్ రికార్డులు, మెసేజ్‌లు, వాయిస్ నోట్స్ వంటివి కూడా డిలీట్ చేసేయాలి.
స్టోరేజ్ బ్యాకప్..
ఫోన్ ఇతరులకు ఇచ్చేముందు మీ కాంటాక్ట్స్, మెసేజెస్, వాట్సాప్ చాట్స్‌ను బ్యాకప్ చేసుకోవడం ముఖ్యం. హార్డ్ డిస్క్/పెన్ డ్రైవ్ లేదా గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్ చేసుకుంటే కొత్త ఫోన్‌లోకి రీస్టోర్ చేసుకోవడం ఈజీ అవుతుంది.
అకౌంట్స్ లాగవుట్..
మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు అన్ని అకౌంట్లను లాగవుట్ చేయాలి. గూగుల్ అకౌంట్ల నుంచి డేటా రికవరీ అవ్వకూడందటే రీసెట్ కంటే ముందే లాగవుట్ చేసి గూగుల్ డేటా, క్యాచీని డిలీట్ చేసేయాలి.
ఇవి కూడా..
ఇక వీటితోపాటు మైక్రో ఎస్‌డీ కార్డ్, సిమ్ వంటివి ఎలాగూ తొలగిస్తారు. ఒకవేళ ఇ–సిమ్ వాడుతున్నట్టయితే టెలికాం ఆపరేటర్‌ను సంప్రదించి సిమ్‌ను మొబైల్‌తో డీరిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫోన్ అమ్మాలి అనుకుంటే అమ్ముతున్న వారి వివరాలు సేకరించి పెట్టుకోవాలి. అలాగే బిల్, ఇన్‌వాయిస్ వంటివి ఫోటో తీసి దాచిపెట్టుకుంటే ఫ్యూచర్‌లో ఏదైనా అవసరం పడొచ్చు.